దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో కలిసి RRR సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం.1 సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టిన దర్శకధీరుడు రాజమౌళి మొన్నటి బాహుబలి 2 వరకు ఏ ఒక్క సినిమా ఫ్లాప్ కాలేదు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడుగా రాజమౌళి మంచి పేరు తెచ్చుకున్నాడు.  తాను తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిద్యాన్ని చూపిస్తుంటారు.


ఈగ సినిమాతో వ్యూజువల్ వండర్ సృష్టించిన రాజమౌళి, ప్రభాస్ తో బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా ప్రేక్షకులకు అందించారు.  ఈ మూవీ టాలీవుడ్ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటింది.  బాహుబలి మూవీతో ప్రభాస్ కి ఏకంగా జాగీయ స్థాయి లో ఎంతో క్రేజ్ లభించింది. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘మగధీర’లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు మూవీలో కొత్త విప్లవం తీసుకు వచ్చారు. అప్పటి వరకు జానపద సినిమాల్లో లేని అద్భుతాలను ఈ మూవీలో చూపించారు. 


తాజాగా ఎన్టీఆర్-రాంచరణ్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా 400కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వాస్తవానికి ఈ షూటింగ్ షెడ్యూల్ కంటిన్యూగా సాగాల్సి ఉన్నా..హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ కి గాయాల కారణంగా పోస్ట్ పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఫిట్ గా ఉండటంతో.. ప్రస్తుతం బల్గెరియాలో సినిమాకు సంబందించిన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ పాత్ర కోసం ఈ షెడ్యూల్ ని స్పెషల్ గా ప్లాన్ చేశారు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు.  తెలుగు రాష్ట్రాల మన్యం వీరులను జక్కన్న ఎలా చూపించబోతున్నారో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: