సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సరికొత్త వివాదానికి తెరలేపారు. ఇటీవల 'లక్ష్మీ'స్ ఎన్టీఆర్'తో వివాదాలు రేకెత్తించిన వర్మ. మొన్నటికి మొన్న ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైనప్పుడు వర్మ చేసిన బీర్ రచ్చకి వెబ్ సైట్లన్నింటికీ జ్వరం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 


ఇప్పటికే టైటిల్ సాంగ్ తో రచ్చ చేసిన వర్మ నిన్న క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ని విడుదల చేసి ఇంకాస్త హీట్ పెంచాడు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ లో వర్మ వాయిస్ ఓవర్ తో పాటు, ఆయన పాడటం జరిగింది. దేశంలో మనుషులు కుల సంకుచిత భావాలతో నిండిపోయినప్పుడు కులం గురించి చెప్పుకోవడంలో తప్పేముంది. పైకి వేదాలు వల్లిస్తూ, లోపల మనఃసాక్షిని కుల ప్రాదిపదికన నడిపిస్తే ప్రయోజనమేముంది. 


కులానికి మేము వ్యతిరేకులమనే ఈ వేషాలెందుకు, చేసేవన్నీ కులం ఆధారంగా చేస్తున్నప్పుడు. విద్యా, ఉద్యోగం, రాజకీయం పనేదైనా, ప్రయోజనం ఎలాంటిదైనా అసలు ప్రామాణికం కులమే అయినప్పుడు బహిర్గతంగా కులం గురించి చెప్పుకుంటే తప్పేముంది. అనే ధోరణిలో సాగిన వర్మ సాంగ్ ఆలోచింపజేసేదిలా ఉంది.


ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తుంది. నెం 1 ట్రేండింగ్ లో నడుస్తున్న ఈ పాటను వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసారు. అంతేకాకుండా నేను చాల ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా .. నా క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ట్రెండ్ అయినందుకు .. జై రాజు .. జై ప్రభాస్ .. జై సాహో అంటూ పేర్కొన్నారు. మరి ప్రభాస్ ని ఈ రేంజ్ గా వాడుకున్న ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: