చిరంజీవంటే చిన్నపిల్లాడి నుండి పడుచు,వయస్సు వారితో సహా అందరికి ఎంతో అభిమానం.ఒకప్పుడు,ఇప్పుడు ఆయన సినిమాలు వస్తున్నాయంటే చిరు అభిమానులకు పండగే,ఆయన సినిమా చేస్తున్నారంటే,ఆ చిత్రం పై అంచనాలు ఏ స్దాయి లో ఉంటాయో అందరికి తెలిసిన విషయమే.దానికి ఉదాహరణ త్వరలో రాబోయే సినిమా సైరా..ఈ సినిమాతో తెలుగులో నే కాకుండా హిందీలో కూడా సంచ‌ల‌నం సృష్టించాల‌ని చూస్తున్నాడు చిరంజీవి.ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు సైరా కోసం 250 కోట్ల‌ కు పైగా ఖ‌ర్చు చేసాడు రామ్ చ‌ర‌ణ్.ఈయ‌న ఓ వైపు రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తూనే మ‌రోవైపు త‌న తండ్రి సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు కూడా చూసుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ఒకేసారి ఐదు భాషల్లో ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న విడుదలకు సిద్దమౌతుంది .. 




ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ హీరోలకే కాదు పలువురు బాలీవుడ్ కథానాయకులకు కూడా  ఎంతో అభిమానం.చిరు సింప్లిసిటీని చూసి షాకవ్వని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.సందర్భం ఏదైన చిరు గురించి ఏ సెలబ్రిటీ మాట్లాడినా ముందుగా ఆయన సింప్లిసిటీ గురించే చెబుతారు.తాజాగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ చిరు గురించి ఒకానొక సందర్భం లో మాట్లాడుతూ,నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం.తెలుగు హీరోల వర్క్ అన్నా నాకు చాలా నచ్చుతుంది.ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం..




చిరు సర్‌ని చాలా సార్లు కలిశాను.అహం అనేది లేని వ్యక్తి,చాలా సౌమ్యంగా మాట్లాడతారు.ఓసారి ఐఫా అవార్డ్ వేడుకలు జరుగు తుంటే చిరు కూడా వచ్చారు.ఆసమయంలో ఆ వేడుకకు నేనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాను.అక్కడికి వచ్చిన ఇతర సెలబ్రిటీ ల వద్దకు చిరు స్వయంగా వెళ్లి పలకరించడం చూసి షాకయ్యాను.ఆయన ప్రవర్తన టాలీవుడ్ చిత్రపరిశ్రమ కల్చర్ ఎలా ఉంటుందో తెలియజేసింది.ఆయన చాలా అద్భుతమైనవ్యక్తి’అనివెల్లడించారు.ఇక పోతే హృతిక్ నటించిన వార్ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు..ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: