ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సాహో సినిమా గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా ఈ నెల ముప్పైన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు వేల కోట్ల దోపిడీకి సంబంధించిన కేసును చేధించే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. అయితే అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానులకు షాకిస్తున్నాడు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.


నీల్ నితిన్, ముకేష్, జాకీ, ష్రాఫ్, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్మందిరా బేడి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా సాహో సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు అశోక్ చక్రవర్తి అని కూడా తెలుస్తుంది. ఇకపోతే సాహో చిత్రం టిక్కెట్ లను అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హై కోర్టు తగిన వివరణ ఇవ్వాలని కోరుతూ హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విశాఖ పోలీస్ కమిషనర్ సాహో చిత్ర పంపిణీదారు దిల్ రాజుతో పాటు తదితరులకు నోటీసులు జారీ చేసిందని సాహో టిక్కెట్ల ధరలను వంద రూపాయలు, రెండు వందల, మూడు వందలగా నిర్ణయించి వసూలుకు సిద్ధమైన వారిప్రయత్నాలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


దీనిపై మంగళవారం జస్టిస్ జి శ్యాం ప్రసాద్ ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది సాహో సినిమా టికెట్ల ధరలు పెంచకుండా ఆదేశించాలని అభ్యర్థించారు. ఇక ఈ సినిమా రిలీజైన తరువాత పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుంటుందో లేదోనని ప్రభాస్ ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారట. అత్యంత భారీ స్థాయిలో థియేటర్లు అదనపు షోలతో ప్రపంచవ్యాప్తంగా ఒక మ్యానియాను సృష్టించుకున్న సాహో తొలి ఆట గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సాహో మొదటి షో రేపు రాత్రి దుబాయ్ కాలమానం ప్రకారం రేపు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు  దుబాయిలోని ఐమాక్స్ ఫార్మేట్ థియేటర్లో మొదటి షోను వేయబోతున్నారు.


అయితే తెలుగు వర్షన్ సాహో కాదు హిందీ సాహో వర్షన్ను దుబాయ్ లో నాలుగు స్ర్కీన్స్ లో రేపు సాయంత్రం ప్రదర్శించబోతున్నారు. మన భారత కాలమానం ప్రకారం లెక్క వేసుకుంటే ఈమూవీ రిజల్ట్ ఖచ్చితంగా రేపు అర్ధరాత్రికి వచ్చేస్తుంది. ఈ టాక్ వచ్చిన కొన్ని గంటలకే ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో, అదే విధంగా ఇండియాలో సాహో మొదటి షోలు పడబోతున్నాయి. దుబాయి లోని ఐమాక్స్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని సాహో మూవీని ప్రభాస్ అతడి అభిమానులు కన్నా ముందుగా చూడబోతున్నాడు. ఇదిలా ఉండగా ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముప్పై వ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల నుండి సాహో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. చిన్న పట్టణాలుగా పేరుపొందిన ఏలూరు భీమవరం తణుకు లాంటి ప్రాంతాల్లో ఎల్లుండి అన్ని థియేటర్స్ లోనూ సాహో మార్నింగ్ షో వేయబోతున్నారు. అంటే ఈ మూవీ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.


దుబాయి ప్రమోషన్ ముగిసిన తరువాత ప్రభాస్ ఇండియాకు తిరిగొచ్చి మళ్లీ జనం మధ్య సాహో మూవీ ని చూసి ఆ తర్వాత లండన్ అమెరికాకు వెళ్లే ఈ మూవీ ప్రమోషన్ ను కొనసాగిస్తాడని టాక్ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఈ రోజుకు ఆరు ఆటలు ఆడేలా పర్మిశన్ ఇప్పించాలని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక వారి విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. దీంతో పాటు టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఈ పెరిగిన రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాలపాటు మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయి. కాగా అదనపు షోస్ కోసం టిక్కెట్ ధర పెంపు కోసం సాహో ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ సిగ్నల్ దొరికిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: