భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రిలీజ్ అయిన క్రిష్‌3 మూవీ బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టింద‌నే వార్తలు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లోనూ క్రిష్‌3 మూవీ ఓ కామెడీ ఫిల్మ్‌గా మారిందంటూ హృతిక్‌రోష‌న్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా హృతిక్‌రోష‌న్‌ను టార్గెట్ చేసుకుంటూ వ‌స్తున్న కామెంట్సే అని బాలీవుడ్ అంటుంది. క్రిష్‌3 మూవీను చూసిన బాలీవుడ్ సెల‌బ్రిటీస్‌, మొద‌టి షోకే బ్యాడ్ మూవీ అంటూ కామెంట్ చేసేశారు. వీరిలో చాలా మంది ఫిల్మ్ డైరెక్టర్స్ కూడ ఉన్నారు. హృతిక్ రోష‌న్‌తో క్రిష్ సీక్వెల్స్‌ను ఇంత‌టితో ఆపేయ‌వ‌చ్చు అంటూ రాకేష్ రోష‌న్‌కు స‌ల‌హాలు ఇస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ సుజ‌య్ ఘోష్ దీనికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను బ‌హిరంగంగానే చెప్పాడు. 'క్రిష్‌3 మూవీను చూశాను. సాలిడ్‌ ఫ‌న్ మూవీ ఇది. హృతిక్ రోష‌న్ త‌న న‌ట‌న‌తో ఎంతో కామెడీ చేశాడు' అంటూ సైటైరిక‌ల్‌గా మాట్లాడాడు. దీంతో ఈ డైరెక్టర్ మాట‌ల‌పై బాలీవుడ్‌లో ర‌క‌ర‌కాలు టాక్స్ న‌డుస్తున్నాయి. క్రిష్‌3 మూవీ బాగోలేద‌ని చెప్పటానికి ఈ విధ‌మైన మాట‌లు మాట్లాడాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని హృతిక్ అభిమానులు అంటున్నారు. అలాగే క్రిష్‌3 మూవీకు మ‌ల్టీప్లెక్స్‌లో అయిదు వంద‌ల రూపాయ‌ల టికెట్ రేటును పెట్టారు. వెంట‌నే ఆ టికెట్‌ను రేటును త‌గ్గిస్తే క‌నీసం థియోట‌ర్లు అయినా హౌస్‌ఫుల్ క‌లెక్షన్స్‌తో ఆడ‌తాయి అని మ‌ల్టిప్లెక్స్‌ య‌జ‌మానులు ఆలోచిస్తున్నారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: