టాలీవుడ్ కు బాలీవుడ్ కు చాలా తేడా ఉంది.. అదేంటి ఇప్పుడు టాలీవుడ్ సినిమాలే బాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేస్తున్నాయి కదా అని చెప్పుకోవచ్చు. సినిమాలు ఓకే కాని అక్కడ వారి నడవడిక రావాలంటే మాత్రం టాలీవుడ్ కు మరో 20 ఏళ్లు ముందుకెళ్లాల్సిందే. అక్కడ స్టార్ కిడ్స్ అంతా లవ్, డేటింగ్ అంటూ రచ్చ రచ్చ చేస్తారు.


ఇక్కడ మన స్టార్ కిడ్స్ ఏదైనా చిన్న పని చేస్తే చాలు దానికి ఆ హీరో ఫ్యాన్సే నానా అల్లరి చేస్తారు. ఈ తేడా చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఓ స్టార్ కిడ్ తన లవర్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. ఆమె ఎవరో కాదు సై గారాల పట్టి సారా అలీ ఖాన్. కార్తిక్ ఆర్యన్ తో సారా అలీ ఖాన్ లవ్ లో ఉందని తెలుస్తుంది.


ఇద్దరిది ప్రేమా కాదా అన్నది పక్కన పెడితే ఇద్దరు మధ్య ప్రేమ చాలా దూరం వెళ్లిందట. అయితే ఈమధ్యనే ఇరు వైపుల నుండి పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక వీరి రచ్చకి అడ్డు అదుపులేకుండా పోతుందట. సరా మదర్ అమృతా సింగ్ సరా లవ్ కు తన యాక్సెప్టెన్స్ ఇచ్చారట. కార్తిక్ ఆర్యన్ తమకు ముందునుండి తెలిసినవాడే కావడంతో సరా లవ్ కు ఓకే చెప్పారు.


కార్తిక్ ఆర్యన్ ఇంట్లో కూడా సారా అంటే ఇష్టమని తెలుస్తుంది. అయితే ఇద్దరి సిని కెరియర్ కు ఇది స్టార్టింగ్ కావడంతో పెళ్లి ఆలోచన ఇప్పుడు వద్దని చెప్పారట. ఫ్యూచర్ లో ఈ ఇద్దరు తప్పకుండా పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు కలిసి ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. సినిమా పూర్తి కాగానే పెళ్లి చేసుకునేలా ఉన్నారని ముంబై మీడియా కోడై కూస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: