కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బిగిల్. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆయన ఫ్యాన్స్ నుండి విపరీతమైన అప్లాజ్ లభించింది. రిలీజ్ అయిన ఆ పోస్టర్ లో విజయ్ రెండు విభిన్న తరహా పాత్రల్లో దర్శనం ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆకట్టుకునే కథ మరియు కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 

గతంలో విజయ్ మరియు అట్లీ కాంబినేషన్లో తేరి, మెర్సల్ వంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో, ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న బిగిల్ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటుగా కోలీవుడ్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే కొద్దిరోజుల క్రితం ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని సింగపెన్ని అనే సాంగ్, యూట్యూబ్ లో రిలీజ్ అయి, అత్యధిక వ్యూస్ దక్కించుకుని సూపర్ డూపర్ రెస్పాన్స్ ని సంపాదించడం జరిగింది. 

ఇకపోతే ఈ సినిమాను రాబోయే దీపావళి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రకటనతో పాటుగా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన నటుల ఫొటోలతో రూపొందించిన ఒక పోస్టర్ ని కూడా, తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఆ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. విజయ్ సరసన నయనతార హీరోయిన్ గా నతిష్టున్న ఈ సినిమాలో ఆనంద్ రాజ్, వివేక్, యోగిబాబు, కథిర్, జాకీష్రాఫ్, దేవదార్శిని, రాజ్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: