టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన సినిమా ‘బాహుబలి, బాహుబలి2’.  దర్శకధీరుడు రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ సుమారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు.  మొదట్లో ఈ సినిమా కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వెల్లువెత్తినా..బాహుబలి సినిమా రిలీజ్ కావడం థియేటర్లో సినిమా చూసి యావత్ భారత దేశం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది.  తెలుగు  స్క్రీన్ పై ఇలాంటి గొప్ప సినిమా రావడంపై విమర్శకులు సైతం ప్రశంసించారు. 

ఈ మూవీతో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది.  మొదటి నుంచి రాజమౌళి విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తున్నారు..అందుకు గ్రాఫిక్ టెక్నాలజీని కూడా అద్భుతంగా వాడుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో వచ్చిన మూవీస్ ఈగ, బాహుబలి, బాహుబలి2.  తాజాగా ఇప్పుడు గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఇవ్వకుండా హ్యూమన్ యాంగిల్ లో ఓ సందేశాత్మక మూవీ తీయడానికి సిద్దమయ్యారు.  ఎన్టీఆర్,రాంచరణ్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందుతుంది.  ఈ మూవీలో ఎన్టీఆర్ తెలంగాణ మన్యవీరుడు కొమురంభీమ్, రాంచరణ్ ఆంధులు మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. సాధారణంగా సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ.  అలాంటి వారిలో రాజమౌళి ఒకరని అంటున్నారు.

వాస్తవానికి ఈయనకు దేవుళ్లు, దెయ్యాలపై ఎలాంటి నమ్మకం లేదని పలు సందర్భాల్లో తెలిపారు..కానీ వాటిని విశ్వసించే వారిని అగౌరవపర్చనని అన్నారు. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఫెయిల్యూర్ ని చూడని ఆయన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఎక్కువ శాతం ప్రాధాన్య ఇస్తారని తెలిసి విషయమే.  చత్రపతి, బాహుబలి లాంటి సినిమాల్లో ఈ సెంటిమెంట్ బాగా వర్క్ ఔట్ అయ్యింది.  తన కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఒక లొకేషన్‌ను సెంటిమెంటుగా భావించి అక్కడ షూటింగ్ చేస్తున్నట్లు  మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం రాజమౌళి తనకు ఇష్టమైన ప్రదేశం బల్గేరియాలో షూటింగ్ మొదలు పెట్టారు.  గతంలో బాహుబలి సినిమా కోసం అక్కడ కొన్ని లోకేషన్లలో షూట్ చేశారు. బాహుబలి ‘ది బిగినింగ్’లో మంచు పర్వతాల నేపథ్యంలో వచ్చే సీన్స్ అక్కడ తీసినవే. ఇప్పుడు అదే చోట ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.   మొత్తానికి జక్కన్న సెంటిమెంట్ ఎంత వరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: