టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ సాహో, ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాహుబలి సిరీస్ లోని రెండు భాగాలూ సూపర్ డూపర్ హిట్స్ కావడంతో ప్రభాస్ కు క్రేజ్, మార్కెట్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియా వైడ్ గా విపరీతంగా పెరిగిపోయింది అనే చెప్పాలి. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ, ఇకపై తన నుండి భారీ బడ్జెట్ సినిమాలే వస్తాయని, ఎందుకంటే బాహుబలి వంటి భారీ సినిమా తరువాత, ఇకపై నన్ను అటువంటి భారీ సినిమాల్లోనే ప్రేక్షకులు తనను చూడాలి అని కోరుకుంటారని, అందువల్లనే తాను అటువంటి సినిమాల్లోనే తాను నటిస్తాను అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల విడుదలైన సాహో ట్రైలర్, మరియు సాంగ్స్ ఈ సినిమా పై హైప్ ను విపరీతంగా పెంచాయి. 

ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి స్పందనను రాబడుతున్న ఈ సినిమాలో ప్రధానంగా కొన్ని హైలైట్స్ ఉన్నాయని, వాటి గురించి నేడు టాలీవుడ్ ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. అవేంటంటే, ముందుగా ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించినట్లు సమాచారం, ఇక హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా ఫుల్ లెంగ్త్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టిందని, ఇకపోతే విలన్స్ గా నటించిన నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్ తదితరులు తమ క్యారెక్టర్స్ కు పూర్తి న్యాయం చేసారని అంటున్నారు. ఇక సినిమాకు ఫోటోగ్రఫీ, విజువల్స్, గ్రాఫిక్స్, రెండు భారీ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విస్టులు ప్రధాన ఎసెట్స్ గా నిలవనున్నాయట. ఇక ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన జీబ్రాన్, టీజర్ మరియు ట్రైలర్ లో ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చాడో మనకు అర్ధం అయింది, ఇక సినిమాలోని కొన్ని సీన్స్ లో అయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరహో అనేలా ఉంటుందట. 

ఇకపోతే మధ్యలో వచ్చే సాంగ్స్ విజువల్ గా సినిమాకు ఎంతో గ్రాండియర్ లుక్ ని తీసుకువచ్చాయని అంటున్నారు. ఇది ఒక పక్కా స్క్రీన్ ప్లే మీద బేస్ అయి నడిచే సినిమా అని, ఆద్యంతం సినిమాకు ప్రేక్షకుడిని బాగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సుజిత్ మరియు అతని టీమ్ పడిన కష్టం అద్భుతం అని అంటున్నారు. అక్కడక్కడా మధ్యలో కాస్త డ్రాగ్ అనిపించినప్పటికీ, ఓవర్ అల్ గా మాత్రం ఈ సినిమా ఎంతో థ్రిల్ చేస్తుంది అంటున్నారు. సో ఇన్నివిధాలుగా అద్భుతమైన హైలైట్స్ తో  ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించిన సాహో సినిమా, ఇకపై ఎంత మేర కలెక్షన్లు సాధించి ముందుకు దూసుకెళ్తుందో వేచి చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: