బిగ్ బాస్ త్రీ లో ముప్పై తొమ్మిదవ రోజు ఉదయం చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా లోని పాటతో అంతా నిద్ర లేచారు. హారన్ మోగగానే అంతా వచ్చి ట్రైన్ ఎక్కారు. అలీ లవ్ స్టోరీని హిందీలో చెబుతూ ఉంటే దాన్ని రాహుల్ తెలుగులోకి ట్రాన్స్ లేట్  చేశాడు. కలకత్తా వచ్చినట్లు ఎనౌన్స్ మెంట్ వచ్చింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చేపలు పట్టండర్రా డింభక అనే టాస్క్ నిచ్చాడు. ఇద్దరు సభ్యులు స్విమ్మింగ్ పూల్ లోనే చేపలను తీసి బాస్కెట్ లో వెయ్యాలని అన్నాడు. అలీ, రాహుల్ పోటీ చేస్తున్నారని సంచాలకుడిగా బాబా మాస్టర్ వ్యవహరిస్తారని చెప్పాడు. రాహుల్ ఏడు చాపలు తీస్తే అలీ పదకొండు చాపలు తీసి విన్నర్ గా నిలిచాడు. అంతా కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశారు. ఒప్పో ఫోన్ లో ఒక సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత రైలు బయలుదేరగానే బాబా మాస్టర్ అందరికీ స్నాక్స్ అమ్మాడు.


నా పేరు చంద్రశేఖర్ అని, పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాను, అప్పుడంతా కొండలా ఉండేది అంటూ బాబా మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక చెట్టు ఉండేదనీ, ట్రైన్ లో వచ్చానని చెబుతూ మాటిమాటికీ మధ్యలో మంచినీళ్ళు తాగాడు. సభ్యులు మధ్యలో కలగజేసుకుంటూ ఉంటే మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాడు. ఇంతలో ముంబై వచ్చినట్లు ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ లైట్స్ కెమెరా యాక్షన్ టాస్క్ ఇచ్చాడు. అయిదు నిమిషాల నిడివికల సీన్ షూట్ చేయాలని అందులో డ్రామా, యాక్షన్, రొమాన్స్ అన్ని ఉండేలా చూసుకోవాలని అన్నాడు. వరుణ్ వెళ్ళి కెమెరా మహేష్ ట్రాలీ బాబా మాస్టర్ నేను డైరెక్టర్ అన్నాడు. అందరూ టెక్నికల్ సైడ్ వెళ్లిపోతే యాక్టింగ్ ఎవరు చేస్తారు అని శ్రీముఖి అంది.


వరుణ్ తో సీన్ ఎలా తీయాలో చెబుతూ బాబా మాస్టర్ ఈ అమ్మాయి యావరేజ్ గా ఉంటే ఆ అమ్మాయిని తియ్యి ఆమె కూడా యావరేజ్ గా ఉంటే ఆ చెట్టును తీయమని చెప్పాడు. సీన్ లో భాగంగా విలన్ అలీ అమ్మాయిలను ఏడిపిస్తుంటే హీరో రవి వచ్చి కొట్టాడు. బాబా మాస్టర్ పాట పాడుతుండగా రవి, హిమజా, జ్యోతి, పునర్నవి కలిసి డ్యాన్స్ చేశారు. తర్వాత అలీ, రవి మధ్య ఫైట్ సీన్ ను స్లో మోషన్ లో తీశాడు. సీన్ అయిపోగానే అద్భుతంగా తీశారు అంటూ అంతా బాబా మాస్టర్ కాళ్ళ మీద పడ్డారు. టాస్క్ ఎండ్ బజర్ మోగగానే అందరూ కలిసి బాలీవుడ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేశారు. తరువాత రైలు బయలుదేరగానే శ్రీముఖి వచ్చి ఎర్రగడ్డ ఆస్పత్రి లోని లవ్ స్టోరీ అనే సినిమా టీమ్ తో ఉన్నామని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అని అంది.


అలీ మాట్లాడుతూ ఉండగా బాబా మాస్టర్ వచ్చి నా కాళ్లు మొక్కురా అన్నాడు. నేను ఇరవై సినిమాల్లో విలన్ గా చేశా మీరు కొత్త డైరెక్టర్ నేను మొక్కను అన్నాడు. హీరోయిన్ హిమజతో మీరు ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏంటి అని అడిగితే ఇంతలో బాబా మాస్టర్, వరుణ్ సందేశ్ కలిసి ఎంతో సీజీ చేశాం. ఎన్నో ఫిల్టర్ లు వాడాం అని చెప్పారు. తర్వాత బాబా మాస్టర్ స్టేజ్ పైకి వచ్చి సినిమాని దయచేసి చూడద్దు. ఊరికే టైంపాస్ కి తీశాం అని చెప్పాడు. మీరు ఎందుకు హీరోగా చేయడం లేదని శ్రీముఖి అడిగితే కన్నీళ్లు పెట్టుకొని త్వరలో ట్రై చేస్తాను అన్నాడు. ఇంతలో కొచ్చిన్ వచ్చినట్లుగా అనౌన్స్ మెంట్ వచ్చింది. అలీ వచ్చి శ్రీముఖి నన్ను బ్రదర్ అంది అని బాబా మాస్టర్ కు చెప్ప గానే కంగ్రాట్స్ అని అలీతో కలిసి ఫీల్ మై లవ్ అంటూ సాంగ్ పాడాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: