యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఎంత గా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత త్వరగా హాలీవుడ్ స్థాయి సినిమాని తలదన్నేలా బాహుబలి.. ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేసింది. బాలీవుడ్ తో సహా అన్నీ భాషల్లో ప్రభాస్ క్రేజ్ ఊహాతీతం. అందుకే సుజిత్ రెడ్డి ప్రభాస్ కోసం ఒక అద్భుతమైన కథని సిద్ధం చేసి రెండేళ్ళు ఎదురు చూశాడు. ఇంకో రెండేళ్ళు సినిమాని తీశాడు. బాహుబలి కన్‌ క్లూజన్ శుభం కార్డ్ పడగానే సాహో టీజర్ తో ' ఇట్స్ షో టైం ' అని సాహో సందడి మొదలు పెట్టారు. ఆ ఒక్క టీజర్ సినిమాని 350 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి ముఖ్య కారణమైంది. నిజంగా ఆ టీజర్ గనక ప్రేక్షకులకు నచ్చకపోతే ఈ రోజు ఇంత భారీ బడ్జెట్ పెట్టే సాహసం చేసేవాళ్ళు కాదేమో. ఇప్పుడు ఆ టీజరే ప్రభాస్ ని మొత్తంగా ముంచేసింది. డిస్ట్రిబ్యూటర్స్ కి, బయ్యర్స్ కి ఇప్పుడు హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. 

బాలీవుడ్ క్వీన్ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరున్ విజయ్..వంటి స్టార్స్ నటించారు. బాలీవుడ్ తో పాటు అన్నీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనగానే ఇక చెప్పలేనంతగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రభాస్ మేకోవర్ చూసినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎప్పుడెప్పుడా అంటు ఎదురు చూశారు. టీజర్, ట్రైలర్స్, సాంగ్ ప్రోమోస్ తో సినిమా పై అంచనాలు తారా స్తాయికి చేరిపోయాయి. దాంతో సాహో ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక గొప్ప సినిమాగా మిగలడం ఖాయమని అందరు గట్టిగా ఫిక్సైయ్యారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ దగ్గర్నుంచి యంగ్ హీరోస్ వరకు అందరు అన్నో అంచనాలతో ఎంతో నమ్మకంగా సినిమా రిలీజ్ కోసం ఎదురు చూశారు. అయితే సామాన్య ప్రేక్షకుడి నుండి స్టార్ హీరోస్ వరకు అందరిని మహా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. 

నిన్న రాత్రి యు.ఎస్ లో పడ్డ ప్రీమియర్ షోస్ తోటే సినిమా ఏంటో తెలిసిపోయింది. కానీ కొన్ని గంటలు ఎంతో తెలివిగా చిత్ర బృందం మానేజ్ చేశారు. ఎంత మానేజ్ చేసినప్పటికి మోర్నింగ్ షో పడ్డ కొంత సేపటికే సాహో ఏంటో దేశమంతా పాకిపోయింది. ఇది ప్రభాస్ చేయాల్సిన సినిమా కానే కాందంటు, అతని కెరీర్ లో ఇంతటి దారుణమైన డిజాస్టర్ ఇంకోటి లేదని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: