ఏంటి సాహూకి రాజమౌళికి సంబంధం ఏంటి ఎందుకు ఆ హెడ్లైన్ పెట్టారు అని కోపం వస్తుందా ? వచ్చిన తప్పులేదు.. ఎందుకంటే ఆ హెడ్లైన్ అలా ఉంది మరి ! ఆ మాత్రం కోపం వస్తుంది. నిజానికి సాహోకి, ప్రభాస్ కి ఏ మాత్రం సంబంధం లేదు కానీ ప్రభాస్ రాజమౌళికి మాత్రం బాహుబలి సినిమాతో అనుబంధం ఉంది. రాజమౌళితో ఎంతటి స్టార్ హీరో సినిమా తీసిన అతని నెక్స్ట్ చిత్రం తప్పకుండ ప్లాప్ అవుతుంది అంటా..! 


అందుకే సాహూ కూడా ప్లాప్ అయ్యిందట. ఇంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు ? అని మీ డౌట్ కదా.. అందుకే నమ్మలేని నిజమైన కాంటెంట్ తో వచ్చా. నిజానికి రాజమౌళి సినిమాలతో హీరోలు అందరికీ భారీ సక్సెస్ అందుతుంది. కానీ ఆ తర్వాతే వాళ్ళు హిట్ కొట్టడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అది రాజమౌళి సెంటిమెంట్ అంటా.. 


నితిన్ అంతకముందు మంచి చిత్రాలతో ఆకట్టుకొని తెలుగు ప్రజలకు దగ్గర అయ్యాడు. ఆ సమయంలోనే రాజమౌళి అతను కలిసి సై చిత్రం తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత మళ్ళి హిట్ కొట్టడానికి దాదాపు పదేళ్లు వెయిట్ చేసి ఇష్క్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ తర్వాత సింహాద్రి అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీశాడు. ఆ సినిమా తర్వాత మళ్ళి జక్కన్నతో కలిసి యమాదొంగలో నటించే వరుకు హిట్ అందలేదు.


రవితేజ విక్రమార్కుడు చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత అతను హిట్ కొట్టడానికి దాదాపు దశాబ్దం పట్టింది. సునీల్ తో మర్యాద రామన్న అంటూ ఓ సినిమా తీశాడు రాజమౌళి. అంతవరుకు కమెడియన్ గా కెరియర్ లో దురుకుపోతున్న సునీల్ కి హీరో అని అవకాశం ఇచ్చి అతని సినీ జీవితాన్ని ఓ మలుపు తిప్పేశాడు రాజమౌళి. ఇలా అందరికి హిట్ ఇచ్చి ఆతర్వాత కోలుకోలేని ప్లాప్ లు ఇవ్వడం రాజమౌళి సెంటిమెంట్.


అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే ఆ తర్వాత దశబ్ద కలం వెయిట్ చేసి మిర్చి సినిమాతో హిట్ కొట్టాడు.. వెంటనే రాజమౌళి బాహుబలి అని ప్రభాస్ అయిదేళ్ళ సమయాన్ని బాలి తీసుకున్నాడు. ఇప్పుడు బాహుబలి సూపర్ హిట్ కానీ ప్రభాస్ సాహూ అట్టర్ ప్లాప్. ఇది రాజమౌళి సెంటిమెంట్.


అయితే 2009లో రాజమౌళి మగధీర అని రామ్ చరణ్ తో కలిసి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వచ్చిన ఆరెంజ్ చిత్రం అట్టర్ ప్లాప్. ఆ తర్వాత చెర్రీ కోలుకోడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' అంటూ ఇద్దరు బిగ్ హీరోస్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పక్క హిట్ కొడుతుంది.. ఎందుకంటే దర్శకత్వం వహించేది రాజమౌళి కదా.. కానీ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ పరిస్థితి కూడా ప్రభాస్ లా అవుతే... ఇంకా అంతే ..! 



మరింత సమాచారం తెలుసుకోండి: