భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలుసు.  ఆమెపై దేశవ్యాప్తంగా ప్రముఖులు, అభిమానుల నుంచీ ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆదివారం జరిగిన టైటిల్‌ ఫైట్‌లో జపాన్‌ ప్లేయర్‌ నొజోమి ఒకుహరతో అమీతుమీకి తలపడగా, సింధు పైచేయి సాధించి రెండు వరస సెట్లలో ఒకుహరను ఓడించింది. 21-7, 21-7 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది. ఇప్పటికే ఐదుసార్లు అందని ద్రాక్షగా మారిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్ షిప్‌లో బంగారు పతకాన్ని సాధించడంతో సింధు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 


ప్రస్తుతం తన కుటుంబంతో కలిస స్పెయిన్‌లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా తర్వాత పిల్లల కోసం సమంత తన కెరీర్‌కు టెంపరరీగా ఫుల్‌స్టాప్ పెడతారట. అదీకాకుండా నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులన్నింటికీ సమాధానం కావాలంటే సమంత హైదరాబాద్‌కు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. 


ఇందులో... సింధూ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర కీలకం కాబట్టి... ఆ పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై బీ టౌన్‌లో చర్చ జరుగుతోంది. అయితే ఈ పాత్రలో సోనూసూద్ చెయ్య‌నున్నార‌ని ఈ చిత్రాన్ని ఆయ‌నే నిర్మించి న‌టిస్తున్నారని స‌మాచారం. ఉత్తరాదినే కాకుండా.. దక్షిణాదిన కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న సోనూసూద్.. పీవీ సింధు బాల్యం నుంచి ఒలింపిక్ మెడల్ సాధించేవరకూ గల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ పాత్ర‌కి స‌మంత అయితేనే న్యాయం చెయ్య‌గ‌ల‌ద‌ని సోనూసూద్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మ‌రోప‌క్క పెల్లెల గోపీచంద్ బ‌యోపిక్ కూడా తెర‌కెక్క‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: