ప్రభాస్ శ్రద్ద కపుర్ జంటగా నటించిన  సినిమా సాహో భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా కావడంతో ప్రభాస్ ౩౦ రోజులు కష్టపడి దేశంలోని నలుమూలలు తిరిగి సినిమాని  ప్రమోట్ చేశాడు.ఆయన కష్టానికి తగ్గట్టే సినిమాకి ఇండియా మొత్తం ఫూల్ క్రేజ్ వచ్చింది. కానీ సాహో  అంచనాలను అందుకోవడంలో వెకనబడింది.


సాహో సినిమా మొదటి రోజు  అన్ని భాషల్లో డివైడ్ టాక్ సంపాధించుకుంది.తెలుగులో నెగిటివ్ టాక్ కొంచెం ఎక్కువగా వచ్చింది.సాహో సినిమాకీ  చాలా మంది బాలీవుడ్ రివ్యూయర్స్  దారుణమైన రివ్యూస్ ఇచ్చారు. కానీ డివైడ్ టాక్ మరియు బ్యాడ్ రివ్యూస్ సినిమా కలెక్షన్స్ ని ఆపడంలేదు.మొదటి రోజు సాహో హిందీ వర్షన్ 24 కోట్ల నెట్ సాధించింది .

  రెండన రోజు  కలెక్షన్స్  తగ్గుతాయని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ సాహో 23 కోట్లు నెట్ సాధించింది. ఇది చూసి బాలీవుడ్ స్టార్స్ మరియు ట్రెడ్ పండితులు ఆశ్చర్యనికి లనులను. ఇలా డివైడ్ టాక్ మరియు బాడ్ రివ్యూస్ లను తట్టుకోవడం బాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల వల్లే కాలేదు. కానీ  ప్రభాస్ కున్న క్రేజ్ వల్ల హిందీ ప్రేక్షకులు వాటిని లెక్క చేయడం లేదు
ఆది వారం, సోమ వారం  రెండు రోజులు సెలవు దినాలే కాబట్టి కలెక్షన్ ఇలానే ఉంటాయని అంచనా. మొదటి వారం హిందీ వర్షన్ 75 కోట్ల్ నెట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో మొదటి రోజు దాదాపు 4 కోట్ల గ్రాస్ సాధించింది.ప్రస్తుతం  హిందీ, తెలుగులో పెద్ద సినిమాలు లేవు కాబట్టి సాహోకు అంత ప్రమాదం లేదు.సాహో సినిమా రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 205 కోట్ల గ్రాస్ సాధించిందని మూవీ నిర్మాతలు మీడియాకు పోస్టర్ ని విడుదల చేశారు.మంగళ వారం వచ్చే కలెక్షన్స్ సినిమా జాతకాన్ని చెబుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: