టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి నటవారసత్వంతో పాటు ఆయన అశీసులతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొలిసినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోగా పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్. అయితే నటుడిగా అరగంటేత్రం చేసిన ఫస్ట్ సినిమానే మంచి విజయాన్ని అందుకోవడంతో, మెగాస్టార్ తమ్ముడిగా పవన్ మంచి పేరు సంపాదించారు. ఇక ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత మరియు సుస్వాగతం సినిమాలు కూడా సక్సెస్ సాధించడంతో కళ్యాణ్ కు యూత్ లో మంచి పేరు, క్రేజ్ రావడం జరిగింది. ఆపై ఆయన కరుణాకరన్ దర్శకత్వంలో చేసిన తొలిప్రేమ సినిమా అప్పట్లో అత్యద్భుత విజయాన్ని అందుకుని, పవన్ కు హీరోగా మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం ఆయన నటించిన ఐదవ సినిమా తమ్ముడు మూవీ యావరేజ్ గా నిలిచింది. తదుపరి పూరి జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం అవుతూ పవన్ హీరోగా తెరకెక్కించిన  బద్రి సినిమా సూపర్ హిట్ సాధించి, మరొక హిట్ ని కళ్యాణ్ ఖాతాలో వేసింది. ఇక ఆ తరువాత ఆయన తమిళ మూవీ ఖుషి ని తెలుగులో ఎస్ జె సూర్య దర్శకత్వంలో రీమేక్ చేయడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, మంచి కలెక్షన్లు సాధించడం మాత్రమే కాక ఆయనకు పవర్ స్టార్ గా అభిమానుల్లో మంచి పేరు తీసుకువచ్చింది. 

ఇక అప్పటినుండి పవన్ యూత్ లో అద్భుతమైన క్రేజ్ సంపాదించారు. అనంతరం తన తదుపరి తన ఏడవ సినిమాకు కొంత సమయం తీసుకున్న పవన్, తొలిసారి గీత ఆర్ట్స్ బ్యానర్ పై నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా జానీ. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఘోర పరాజయం పాలయింది. ఆపై కొంత గ్యాప్ తరువాత పవన్ నుండి వరుసగా గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు వచ్చినా, అవేవి కెరీర్ పరంగా ఆయనకు విజయాన్ని అందివ్వలేక బాక్సాఫీస్ వద్ద చతికలపడ్డాయి. అయితే అదే సమయంలో ఆయన తొలిసారి దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన జల్సా సినిమా మంచి హిట్ అయి, మరొక్కసారి పవన్ కు మంచి విజయాన్ని అందించింది. ఇక ఆ తరువాత వచ్చిన పులి, తీన్ మార్, పంజా సినిమాలు పవన్ కెరీర్ లో భారీ ఫ్లాపులు గా నిలిచాయి. ఇక ఆపై నిర్మాత బండ్ల గణేష్ బ్యానరైన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీలో హిట్ అయిన దబాంగ్ మూవీ రీమేక్ గా గబ్బర్ సింగ్ లో నటించారు పవన్. అప్పట్లో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి, సరికొత్త రికార్డులను నెలకొల్పింది. దాని తరువాత అయన చేసిన కెమెరామాన్ గంగతో రాంబాబు ఫ్లాప్ అయినా, మరొక్కసారి త్రివిక్రమ్ తో ఆయన చేసిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుంది. 

వాటి తరువాత పవన్, విక్టరీ వెంకటేష్ తో కలిసి గోపాల గోపాల అనే మల్టి స్టారర్ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా అప్పట్లో అబోవ్ యావరేజ్ గా నిలవగా, దాని తరువాత వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు ఫ్లాప్ చిత్రాలుగా మిగిలాయి. అయితే 2014లో జనసేన పార్టీని నెలకొల్పిన పవన్, ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల్లోనే నిమగ్నమయ్యారు. ఇక మొత్తంగా పవన్ మూవీ కెరీర్ ని చూస్తే అయన సినిమాల్లో ఎక్కువగా యూత్ కి నచ్చే అంశాలు మరియు సామాజికంగా ఉపయోగపడే అంశాలు వంటివి ఉండడం గమనించవచ్చు. ఇక పవన్ మరియు సంగీత దర్శకుడు రమణ గోగుల సెన్సేషనల్ కాంబినేషన్లో వచ్చిన తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం, మూవీ సాంగ్స్ అప్పట్లో మంచి పేరు సంపాదించాయి. ఇక నేడు 48వ పుట్టినరోజుని జరుపుకుంటున్న పవర్ స్టార్ కు అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలతోపాటు పలు సామజిక సేవ కార్యక్తమాలు కూడా చేపడుతున్నారు. అయితే కొన్నాళ్ల నుండి పవన్ మళ్ళి సినిమాల్లో నటించాలని కోరుకుకుంటున్న ఆయన అభిమానుల కోరికను ఎంతవరకు మన్నిస్తారో తెలియాలంటే ఆయన నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: