యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన మొదటిరోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రభాస్ అభిమానులకు మొదటి షోకే సినిమాకి డివైడ్ టాక్ రావడంతో షాక్ కి గురయ్యారు. సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న అభిమానులు బయటకు వచ్చిన టాక్ విని కృంగి పోయారు. దాదాపు ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు ప్రభాస్ తన సమయాన్ని కేటాయించడం జరిగింది. దీంతో రిజల్ట్ ఈ విధంగా ఉండటంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో బాధపడ్డారు.


అయితే ప్రస్తుతం సినిమాకి వస్తున్న కలెక్షన్లు బట్టి చూస్తుంటే టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వసూలు చేస్తున్న నేపథ్యంలో మెల్లమెల్లగా టాక్ మారే అవకాశం ఉందని ముఖ్యంగా సినిమా సెకండాఫ్ లో ఉన్న యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించడంతో కచ్చితంగా సినిమా గట్టిగానే వసూలు చేస్తుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలకు చెందినవారు. తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో విడుదలైంది. దీంతో బాలీవుడ్ లో సాహో సినిమా సృష్టిస్తున్న రికార్డర్ ఇప్పుడు నార్త్ లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలి రోజు సాహో హిందీ వర్షన్ 24 కోట్లు సాధించగా, శనివారం రోజు 25 కోట్లు సాధించింది. ఆదివారం రోజు కళ్ళు చెదిరే నంబర్స్ నమోదయ్యాయి.


ఏకంగా 29 కోట్లని సండే రోజు సాహో  హిందీ కొల్లగొట్టింది. మొత్తంగా సాహో చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 79 కోట్ల నెట్ రాబట్టింది. సాహో ప్రభంజనంతో ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల రికార్డులు గల్లంతవుతున్నాయి. తొలి సండే వసూళ్ళని పరిగణలోకి తీసుకుంటే ఇటీవల విడువులైన మిషన్ మంగళ్, భారత్, కబీర్ సింగ్ చిత్రాలంటే ఎక్కుగా సాహో సాధించింది. ఏది ఏమైనా సినిమాకి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా సాహో సంచలనాలు సృష్టిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: