భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో ఫుల్ నెగిటివ్ టాక్‌తో కూడా క‌లెక్ష‌న్లు కుమ్మేస్తోంది. సాహో బ‌డ్జెట్‌, ఆ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌, ఈ సినిమా టాక్ చూశాక సాహూ నిర్మాతలకు బాగా దెబ్బపడిందని అంద‌రు అనుకున్నారు. అయితే సాహో టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు ప‌రంగా కుమ్మేస్తోంది. ఈ సినిమాకు నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ బాగా క‌లిసొచ్చింది.


శుక్ర‌వారం సినిమా రిలీజ్ అవ్వ‌డంతో పాటు శ‌ని, ఆదివారాలు, సోమ‌వారం వినాయ‌క చ‌వితి నేష‌న‌ల్ హాలీడే కావ‌డంతో సాహోకు అదిరిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్రభాస్ బాహుబలి క్రేజ్ మరో ఎత్తు. ప్రభాస్ బాహుబలి క్రేజ్ తోనే నేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయాడు. ఇది కూడా సాహోకు టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు వ‌చ్చేందుకు ఒక‌ కార‌ణ‌మైంద‌ని చెప్పాలి.


హిందీలో నాలుగు రోజుల‌కు ఏకంగా రూ.107 కోట్ల వ‌సూళ్లు రావ‌డం అంటే అక్క‌డి వాళ్లే న‌మ్మ‌లేని ప‌రిస్థితి. హిందీలో సాహో ని తొక్కేద్దామనుకున్నోళ్ళు ఇప్పుడు సాహో కలెక్షన్స్ చూసి నోర్లు మూసుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి వ‌సూళ్లు బాగున్న ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.333 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఆ రేంజులో వ‌సూళ్లు సాధిస్తుందా ? అన్న‌ది చూడాల్సి ఉంది. 
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో 4 రోజుల‌కు 67 కోట్ల షేర్ రాబ‌ట్టింది. 


సాహో ఏపీ, తెలంగాణ 4 డేస్ క‌లెక్ష‌న్లు..


ఏరియా: 4 డేస్ కలెక్షన్స్(కోట్లలో)


నైజాం - 23.30


సీడెడ్ - 9.60


వైజాగ్ ఏరియా - 8.00


గుంటూరు - 7.10


ఈస్ట్ - 6.40


వెస్ట్ - 4.90


కృష్ణ - 4.40


నెల్లూరు - 3.59
-----------------------------------------
ఏపీ + టీఎస్ షేర్స్ = 67.39 కోట్లు
-----------------------------------------



మరింత సమాచారం తెలుసుకోండి: