నాగ చైతన్యకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. చేజేతులా వచ్చిన క్రేజీ ఆఫర్ ను వదిలేసుకోవడం టాలీవుడ్ లో చర్చగా మారింది. తన ఛాన్స్ మిస్ చేసుకోవడమే కాదు.. వెంకటేశ్ అదృష్టాన్ని కూడా తన్నుకుపోయాడు. ఇంతకీ చైతు ఏం చేశాడో.. ఏం పోగొట్టుకున్నాడో ఓ సారి చూద్దాం.. 


రియల్ మామా అల్లుడు నాగ చైతన్య, వెంకటేశ్ వెండి తెరపైన కూడా ఇదే రిలేషన్ తో నటిస్తున్న చిత్రం వెంకీమామ. జై లవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దామనుకుంటే అనుకున్నట్టు షూటింగ్ జరగడం లేదు. 


చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. సైరాతో పోటీ లేకుండా.. సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేస్తే.. అటు దసరా కూడా కలిసొస్తుందని ఆశించాడు నిర్మాత. అయితే షూటింగ్ అనుకున్న సమయంలో కావడం లేదు. నాగార్జున 60వ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం చైతు పారిస్ వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత షూటింగ్ లో పాల్గొన్నా... వెంకీమామను దసరా నాటికి రిలీజ్ చేయడం కష్టమట. 


సంక్రాంతి.. దసరా బరిలో రెండు మూడు సినిమాలు రావడం కామన్. దసరాకు సైరా తప్ప మరో సినిమా లేదు. వస్తుందనుకున్న వెంకీమామ వచ్చే అవకాశం తక్కువే. దసరా మిస్ అయితే.. దీపావళికి రెడీ చేద్దామనుకున్న ప్లాన్ ఉన్నాడు వెంకీ మామ. 10రోజులు సెలువులుండే దసరా వదులుకొని.. ఒకరోజు సెలవుండే.. దీపావళిని నమ్ముకోవద్దని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. మరి వెంకీమామ ఏం చేస్తాడో చూడాలి. ఇది అక్కినేని అభిమానులకు.. అటు వెంకటేశ్ అభిమానులలో ఉత్కంఠ రేపుతోంది. నిజంగా ఊహించని విధంగా దసరాకు రిలీజైతే ఇక సినీ ఫ్యాన్స నిజంగానే పండుగే.




మరింత సమాచారం తెలుసుకోండి: