తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో ప్రస్తుతం 11 మంది కంటెస్టంట్స్ ఉన్నారు. అయితే సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఊహించని విధంగా యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక ఈ వారం నామినేషన్ లో ఆరు వారాలుగా నామినేషన్స్ లోకి రాని అలి రెజా వచ్చాడు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే నామినేషన్స్ లో ఎక్కువమంది నామినేట్ చేసింది అలి రెజానే. 


వారం ముందు వరకు అలి రెజా ఇప్పటివరకు బిగ్ బాస్ హౌజ్ లో ఆరు వారాలుగా ఒక్కసారి కూడా నామినేట్ అవలేదని చెప్పి అతనికి ఫేవర్ గా ఉన్న ఆడియెన్స్ కాస్త అతని కోపానికి ఇప్పుడు అతన్ని బలయ్యేలా చేస్తున్నారు. నామినేషన్స్ అంటే ఒకరకంగా సీన్ రివర్స్ అయితే ఎవరైనా హౌజ్ నుండి బయటకు రావొచ్చు.


ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అలి రెజా నామినేషన్ ను కూడా చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కాని అతనికి తెలియని విషయం ఏంటంటే అతనికి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్ని ఇంటి నుండి బయటకు తెచ్చేలా చేసినా చెయ్యొచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిని చూస్తే రాహుల్, శ్రీముఖి, మహేష్, అలి రెజా, రవి కృష్ణలు ఉన్నారు.   


అలి తర్వాత ఆడియెన్స్ గురి రవి కృష్ణ మీద ఉంది. ఇప్పటివరకు మంచి వాడి ముసుగులో ఉన్నాడని.. ఇంకా తన అసలు మాస్క్ తీయట్లేదని రవి మీద వార్తలు వస్తున్నాయి. ఈ వారం మహేష్ కు త్రెట్ ఉందని చెప్పొచ్చు. రాహుల్, శ్రీముఖి ఇద్దరు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారే కాబట్టి వారు తప్పకుండా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇంతకీ 7వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. ఎవరు ఈ ఇంటి నుండి బయటకు వెళ్తారు అన్నది తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: