ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఉద్యమాన్ని తీసుకు వచ్చిన నటి శ్రీరెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎంతో మంది అమాయక అమ్మాయిలు టాలీవుడ్ లో కొంత మంది దళారుల చేతుల్లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని..సినీ పరిశ్రమలో ఛాన్సులు ఇప్పిస్తామని చిన్న నుంచి బడా బాబుల వరకు అమ్మాయిలను వాడేసుకుంటున్నారని..తీరా ఛాన్స్ అడిగిగే ఇప్పుడు..అప్పుడు అంటూ తమ చుట్టు తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 

తాను కూడా అలా బలయ్యానని..కొంత మంది తనతో చనవువుగా ఉన్నవారి ఫోటోలు, ఛాటింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇక తనకు మా అసోసియేషన్ వారు కార్డు ఇవ్వడం లేదని ఏకంగా ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది.  ఈ న్యూస్ ఇంటర్ నేషనల్ లెవెల్లో ఫోకస్ అయ్యింది. తాజాగా ఇప్పుడు ఫిలిమ్ ఛాంబర్ మరోసారి తెరపైకి వచ్చింది. 


 సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్టు తనకు న్యాయం చేయాలంటూ ఫిలిమ్ ఛాంబర్ లో ఆందోళన చేపట్టింది. తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిల్మ్ చాంబర్‌లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే సునిత గతంలో పవన్ కళ్యాన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలో ఎంతో చురుకుగా పని చేసింది. అలాంటిది తనకు గీతాఆర్ట్స్ వారే అన్యాయం చేశారని ఆందోళన చేస్తుంది. గీతా ఆర్ట్స్‌లో సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారంటూ సునీత ఆరోపించారు.

అంతే కాదు జనసేనలో పనిచేసినందుకు తనకు మంచి పొజీషన్ కల్పిస్తామని చెప్పి..ఇప్పుడు తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై అల్లు అరవింద్ స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. కాగా, సునిత బోయ చేస్తున్న ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో అన్న విషయంపై  పోలీసులు విచారణ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: