పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అటు అభిమానులు, ఇటు జనసేనా నాయకులు, కార్యకర్తలు బర్త్ డే సెలబ్రేషన్స్ భారీగా చేశారు. అటు సోషల్ మీడియాలోనూ పవన్ బర్త్ డే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నడిచేలా చేసి రికార్డ్ నమోదు చేశారు ఫ్యాన్స్. ఇంతవరకు బాగానే ఉన్నా... అభిమానం తో పవర్ స్టార్ కు విష్ చేసిన కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ మాత్రం ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవి చూడల్సి వచ్చింది. 

 

పవన్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విష్ చేసిన నికీషా పొరపాటున రాంగ్ హాష్ ట్యాగ్ జత చేసింది. దీంతో ఫుల్ గా ఫైర్ అయిపోయారు ఫ్యాన్స్. దీంతో తన తప్పు తెలుసుకున్న నికీషా పటేల్.... పొరపాటుగా రాంగ్ హాష్ ట్యాగ్ జత చేశాను అని వివరణ ఇచ్చింది. ఈ ఘటన మీడియా లో హై లైట్ కాగా...  దీన్ని ఇంతటితో వదిలేయాలని కోరింది. పవన్ అంటే తనకి చాలా గౌరవం అని.... అభిమానులు కాస్త శాంతంగా ఉండాలని కోరింది. 

 

 

 

అయితే తాజాగా  ఈ వివాదంపై పవర్ స్టార్ యాంటీ హీరోయిన్ పూనం కౌర్ స్పందించింది. నికీషా నీ నిజాయితి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నువు సైలెంట్ గా ఉండు... లేదంటే వాళ్లు నిన్ను ఫన్ గానే చూస్తారు అని సూచించింది. ఇంతకు ముందే నువ్వు ఓ మీడియా ఇంటర్వ్యు వల్ల ఇబ్బందులు పడ్డావ్. మళ్లీ అలాంటి వ్యతిరేకత తెచ్చుకుని... లైఫ్ స్పోయిల్ చేసుకోకు అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: