మానవత్వము మనిషిలో ఉందని చాటడానికి ప్రత్యేకించి పరుగులు పెట్టవలసిన అవసరం లేదు.సందర్భము వచ్చినప్పుడు చాటుకుంటే సరిపోద్ది.ఎవరైన ప్రమాదంలో ఉంటే కాపాడాలనే ఆలోచన రావాలే గాని,ఆసమయంలో నేను,నాహోదా అని అస్సలు ఆలోచించవద్దు.సాయం కోసం ఒక్కడుగేస్తె హోదాను దిగజార్చుకున్నట్లు కాదు అని గుర్తుంచుకోవాలి.ఇక మన తెలుగు హీరోల విషయానికి వస్తే ఎవరికి వారు వారి పరిమితుల్లో తోటి మనిషికి అప్పుడప్పుడు సహయం చేస్తుంటారు.ఇప్పుడు జరిగింది అలాంటి సంఘటనే.ఎక్కువగా వివాదస్పద విషయాల్లో అస్సలు ఇన్వాల్ కాని సాయి ధరమ్ తేజ్,రోడ్డు ప్రమాదం బారినపడి విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని తన కారులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి తనలో మానవత్వాన్ని తెలియచేసాడు.



ఇక ప్రమాదానికి గురైన బాధిత వ్యక్తి కూడా సినీ రంగానికి చెందిన వాడే కావడం గమనార్హం.జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 42 వద్దనున్న ఓ మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి పడి యువ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి తీవ్రంగా గాయపడ్డాడు.ఎవరికి సంబధం లేనట్లుగా పరిగెడుతున్న ఆ సమయంలో అతడి వెనుకే వస్తున్న హీరో సాయితేజ అక్కడి దృష్యాన్ని చూసి,ప్రమాదం విషయాన్ని గుర్తించి వెంటనే తన వాహనాన్ని నిలిపేసి అతడిని కాపాడారు.



ఆసమయంలో నానక్‌రామ్‌గూడలో వున్న రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకొని సాయిధరమ్‌ తేజ ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఇక అచ్చూ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డు పై వెళ్లుతున్న కారును ఢీ కొట్టింది.దీంతో అతడు సుమారు 10 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు.చూసారా మనకెందుకులే అని పట్టించుకోకుండా పరిగెత్తే పట్నంలో సాయి స్పందించిన తీరును ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఇక తోటివారికి సాయం చేయాలంటే తొడ కోసుకో వలసిన అవసరం లేదు.ఆపదలో వుంటే ఇలా తోచిన సహయం చేస్తే చాలంటున్నారు ఈ విషయం తెలసిన వారు..


మరింత సమాచారం తెలుసుకోండి: