ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరియు దర్శకుడు పూరి జగన్నాథ్ ల కలయికలో ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా, సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని అద్భుతమైన కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. అప్పటివరకు కెరీర్ పరంగా హీరో రామ్ మరియు దర్శకుడు పూరి ఫ్లాప్స్ తో సతమతం అవుతుండడంతో, ఒక్కసారిగా ఈ సినిమా సూపర్ హిట్ సాధించి, వారిద్దరికీ మంచి కిక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మాస్ స్టయిల్ లో సాగిన రామ్ పెర్ఫార్మన్స్ మరియు డైలాగ్స్ కు థియేటర్స్ అదిరిపోయింది. 

అలానే ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్ లు మరియు ఫైట్ లు కూడా ఎంతో ఆకట్టుకోవడం, ఇక పూరి మార్క్ డైలాగ్స్ ని రామ్ తనదైన శైలిలో పలికిన విధానం మాస్, మరియు యూత్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. వాటితో పాటు మణిశర్మ అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్లు నభ నటేష్, నిధి అగర్వాల్ ల అందాలు వెరసి ఇస్మార్ట్ ను సూపర్ హిట్ దిశగా నడిపించడం జరిగింది. పూరి కనెక్ట్స్ బ్యానపై, నటి ఛార్మి తో కలిసి పూరి ఈ సినిమాను స్వయంగా నిర్మించడం జరిగింది. 

ఇకపోతే ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 50 రోజలు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా ఆడుతోందని, మొత్తంగా ఓవర్ ఆల్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే, ఇస్మార్ట్ శంకర్ సినిమా నిర్మాతలకు చాలావరకు లాభాలు తీసుకురావడంతో పాటు సినిమా యూనిట్ కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతో అతి త్వరలో రామ్, పూరిల కలయికలో డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావలసి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: