బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు రోజు రోజుకి ఓ కొత్త టర్న్ తీసుకుంటుంది. మాములుగా ఉన్నప్పుడు అందరు కలిసికట్టుగా ఉంటున్నట్టుగా కనిపిస్తున్న కంటెస్టంట్స్ బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇస్తే చాలు గ్రూపులుగా మారి ఒక వ్యక్తినే టార్గెట్ చేయడం జరుగుతుంది. గత రెండు రోజులుగా జరుగుతున్న దొంగలు, ఊరు వాళ్ల టాస్కులో భాగంగా శ్రీముఖి ఎప్పటిలానే రాహుల్ ను టార్గెట్ చేయగా మిగతా ఇంటి సభ్యులంతా రవిని టార్గెట్ చేశారు.


అయితే ఇంటి సభ్యుల మధ్య గొడవ ముదురుతున్నట్టుగా భావించిన బిగ్ బాస్ ఆ టాస్క్ ను క్యాన్సిల్ చేశాడు. టాస్క్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోడానికి కారణమైన ఇద్దరు ఇంటి సభ్యులుగా రాహుల్, రవిలను జైలులో ఉంచారు. ఇంట్లోంచి ఫుడ్ కూడా వారికి అందదని శిక్ష విధించాడు బిగ్ బాస్.


ఇదిలాఉంటే మరో పక్క బిగ్ బాస్ ఈ సీజన్ లో సూపర్ కపుల్ గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్, వితికలు గొడవలు పడుతున్నారు. టాస్క్ ఏదైనా సరే ఇద్దరు చెరో టీం లో ఉండటం వల్ల వితిక మిగతా ఇంటి సభ్యుల మీద ఫైర్ అయిన ప్రతిసారి వరుణ్ ఆమె మీద ఎటాక్ చేస్తున్నాడు. అంతేకాదు ఇంట్లో మిగతా వాళ్ల ముందు తనని తిడుతున్నాడని వితిక చాలా ఫీల్ అవుతుంది.


నిన్నటి ఎపిసోడ్ లోనే తనని అసలు పట్టించుకోవట్లేదని వితిక అడుగగా మనం వచ్చింది హనీమూన్ కి కాదు బిగ్ బాస్ లో గేం ఆడటానికి అంటూ వరుణ్ సందేశ్ వితికపై సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ వల్ల తమలోని లోపాలని తొలగించుకుని మరింత దగ్గరవుతారని భావిస్తే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల వల్ల వరుణ్, వితికలు తరచు గొడవపడుతున్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నట్టు ఉంది. మరి ఈ టాస్క్ ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: