నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ మరియు లిరికల్ సాంగ్స్, ఇప్పటికే యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. నాని, పెన్సిల్ అనే ఒక రచయిత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన మలయాళ నటి ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు కాస్త నెమ్మదిగా తమ సినిమాను ప్రమోట్ చేసిన నిర్మాతలు, గత వారం రోజులుగా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలు పెరిగెత్తిస్తున్నారు. ఇక అందులో భాగంగా నేడు కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్, మాస్ మరియు యువతను తెగ ఊపేస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ ఈ మాస్ పాటను కంపోజ్ చేయడంతో పాటు, హీరో నాని తో కలిసి ఈ సాంగ్ లో స్టెప్ వేయడం జరిగింది. ఓపెన్ ఎయిర్ థియేటర్ లో గ్యాంగ్ లీడర్ ట్రైలర్ ప్రదర్శితం అవుతుంటే, 

నాని మరియు అనిరుద్ బృందం కలిసి సినిమాని కీర్తిస్తూ 'సీను సిరిగి, సీట్లు ఇరిగి, సీటి కొట్టాలోయ్' అంటూ మంచి మాసి స్టయిల్లో సాగిన ఈ సాంగ్, సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసిందనే చెప్పాలి. ప్రముఖ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తుండగా, సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, రఘుబాబు, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచి థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ తో సాగనున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం ఈ నెల 13న, సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత కానీ చెప్పలేం....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: