బిగ్ బాస్ హౌజ్ లో గురువారం వచ్చిందంటే కొత్త కెప్టెన్ ను ఎంచుకునే టైం వచ్చినట్టే. అసలైతేనే నిన్ననే కెప్టెన్సీ టాస్క్ జరగాల్సి ఉన్నా నిన్న ఇచ్చిన దొంగలు.. దొరలు టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవల వల్ల బిగ్ బాస్ ఆ టాస్క్ క్యాన్సిల్ చేశాడు. ఇక ఈరోజు కెప్టెన్ గా అవ్వాలనుకునే ముగ్గురు.. కెప్టెన్ అయ్యేందుకు అనర్హత ఉన్న ముగ్గురు.. కెప్టెన్ గా సపోర్ట్ చేసే ముగ్గురుగా డివైడ్ చేసి ఇసుక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.  


ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో శ్రీముఖి, బాబా భాస్కర్, హిమజ పాల్గొన్నారు. ఇక కెప్టెన్ అయ్యేందుకు అనర్హులుగా రాహుల్, రవి, శిల్పా చక్రవర్తి ఉన్నారు. పునర్నవి, శివ జ్యోతి, వితికలు కెప్టెన్సీ పోటీదారులకు సపొర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కెప్టెన్ అయ్యే వాళ్లకు ఓ బాక్స్ ఇచ్చి అందులో ఇసుక వేయకుండా జాగ్రత్త వహించాలని అన్నాడు.   


అయితే బాక్స్ లో కెప్టెన్ గా అనర్హులైన వారు ఉంటారు. వారు బాక్స్ లో పడిన ఇసుక ఎత్తివేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో అందరు హిమజ వెనుకాల ఉన్న బాక్స్ ను ఎక్కువ ఇసుకతో నింపేశారు. శ్రీముఖి, బాబా భాస్కర్ బాక్సులలో తక్కువ ఇసుక ఉంది. అయితే సంచాలకుడిగా ఉన్న వరుణ్ సందేశ్ ఫైనల్ గా బాబా భాస్కర్ ను విన్నర్ గా ప్రకటించాడు.  


ఈ ఇసుక పోటీలో కూడా అలి రెజాకు, పునర్నవిలకు గొడవ జరిగింది. అలి కావాలని శ్రీముఖి బాక్సులో వేస్తున్న ఇసుకని అడ్డుకుంటున్నాడని పునర్నవి ఫైర్ అయ్యింది. అయితే అతను ఆట నుండి తప్పుకుంటున్నట్టు చెప్పాడు. ఫైనల్ గా బాబా భాస్కర్ కెప్టెన్ గా విజయాన్ని సాధించారు. లాస్ట్ వీక్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో ఉన్న బాబా భాస్కర్ ఈసారి కెప్టెన్ గా విన్ అవడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: