గురువారం జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఈ టాస్క్ లో ఇంటి  సభ్యులందరూ ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అయితే బాబా భాస్కర్ కి ఇంటి సభ్యుల తోడవడంతో బాబా ఇంటి కెప్టెన్ గా గెలిచారు. గురువారం జరిగిన ఎపిసోడ్ లో శ్రీముఖి నిజ స్వరూపం బయటపడింది. కెప్టెన్ పోటీదారుగా ఉన్న శ్రీముఖి బాబా భాస్కర్ గెలిచినపుడు కంగ్రాట్స్ చెప్తూ బాబా భాస్కర్ ని సపోర్ట్ చేసిన శిల్పా చక్రవర్తి తో ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను బాబా భాస్కర్ కి ఇవ్వనంటూ ఆయన మొహం మీదే చెప్పింది.


బాబా భాస్కర్ తో స్నేహంగా మెలిగే శ్రీముఖి ఇలా మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. బాబా భాస్కర్ కెప్టెన్ కావాలని ఇంట్లో ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. అందుకే శ్రీముకిని ఎవరూ పెద్దగా సపోర్ట్ చేసినట్టు కనబడలేదు. ఈ విషయం ఇలా ఉంచితే, టాస్క్ లో జరిగిన దానికి ఆలీ సీరియస్ గా ఉంటే వరుణ్, పునర్నవిలు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగా, శ్రీముఖి ఆలీతో వాళ్లందరూ నిన్ను రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారని ,నువ్వు కామ్ గా ఉండమని చెప్పి, బయటకి వచ్చి వరుణ్ తో ఆలీ విషయం అర్థం చేసుకున్నాడు ఇక దాని గురించి మాట్లాడడు అంటుంది.


ఇక్కడే శ్రీముఖి డబల్ స్టాండర్డ్స్ తో గేమ్ ఆడుతుందని అర్థం అవుతుంది. ఇంకా గురువారం ఎపిసోడ్ లో శ్రీముఖి ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడడంతో ప్రేక్షకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లో టాన్ కంటెస్టెంట్ అన్న గర్వంతో ఆమె ఇలా చేస్తుందన్న భావన కలుగుతుంది. ఈ విషయాలన్నీ నాగార్జున గారు ఎత్తి చూపితే శ్రీముఖికి తను చేసిన తప్పులేంటో తెలుసుకునే  అవకాశం కలుగుతుంది. మరి నాగార్జున గారు శ్రీముఖి చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: