నాగార్జున రెండవ కుమారుడి అక్కినేని అఖిల్ ఇప్పటికి ఒక్క హిట్ కొట్టలేదు. చేసినవి గట్టిగా మూడు సినిమాలు అయితే మూడూ ఫ్లాప్స్ అయ్యాయి. కుర్రాడిలో విషయం ఉంది. హీరో మెటీరియల్ ఉంది. నిజం చెప్పాలంటే నాగార్జున గ్రేస్ అంతా అఖిల్ లో కనిపిస్తుంది. నాగార్జునలో లేని కొత్త విషయం డ్యాన్సులు కూడా అఖిల్ ఇరగదీస్తాడు. డైలాగ్ డెలివరీ కొద్దిగా మెరుగుపరచుకోవాలి. ఎక్ష్ప్రెషన్స్ కూడా జాగ్రత్త చేసుకుంటే యంగ్ హీరోల్లో మంచి ప్లేస్ లో ఉంటాడు.


మనకు తెలిసిన ఇవన్నీ సినిమాల్లో తలపండిన నాగ్ కి తెలియవనుకోవాలా. అయితే అఖిల్ మూవీకి అన్నీ కుదిరినా సుడి లేకుండా పోతోంది అంటున్నారు. కుర్రాడికి లక్ ఎక్కడో తేడా కొడుతోంది. లేకపోతే నాగ్ వంటి స్ట్రాటజిక్ బిగ్ ఫిగర్ వెనకాల ఉంచుకుని  మరీ అఖిల్ ఫల్టీలు కొట్టడమేంటి. ఇవన్నీ ఇలా ఉంచితే అఖిల్ మూడవ ఫ్లాప్ డిప్రెషన్ నుంచి ఇపుడిపుడే కోలుకున్నాడట.


ఫ్యామిలీతో స్పెయిన్ ట్రిప్ సరదాగా వెళ్ళి వచ్చాడు. అక్కడ జాలీగా సందడి చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో కొత్త మూవీకి రెడీ అయిపోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరా అని అంతా అనుకుంటూంటే  టాప్ హీరోయిన్నే లైన్లో పెట్టారని యూనిట్ వర్గాల అనఫీషియల్ న్యూస్, సూపర్ స్టార్స్ తో అదరగొడుతున్న పూజా హెగ్డే అఖిల్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాని అంటున్నారు.


ఆమె అయితేనే ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు సరిపోతుందని అంటున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ రోల్ కి ఇంపార్టంట్ ఉందిట.  అలాగే గ్లామర్ కూడా కావాలట. రెండూ ఉన్న ముద్దు గుమ్మగా పూజా హెగ్డేను ఎంచుకున్నారు. చిత్రమేంటంటే భారీ రెమ్యునరేషన్ పూజ డిమాండ్ చేస్తోంది. అయినా సరే ఒకే అనేసి మరీ అఖిల్ కోసం తీసుకుంటున్నారని టాక్. మరి పూజాతోనైనా  అఖిల్ కి లక్ కలసి వచ్చి హిట్ కొడతారా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: