శ్రీవిష్ణు ఎప్పటికప్పుడు డిఫ్రెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తు ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు మరో లేటెస్ట్ సినిమాతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి రెడి అవుతున్నాడు. బ్రోచెవారెవరురా సినిమా సక్సెస్ తో మంచి ఊపు మీదున్న ఈ హీరో, చాలా కాలంగా పెండింగ్ లో పడిన తిప్పరా మీసం సినిమాను ఎట్టకేలకుకిందా మీదా పడి బయటకు తీశాడు. దాదాపు ఏడాది కిందటే ఈ సినిమా పూర్తయింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి మోక్షం కలిగింది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కానీ సినిమాలో మాత్రం ఓ సస్పెన్స్ ఎలిమెంట్ అలానే ఉంది. అదే మదర్ సెంటిమెంట్.

తిప్పరా మీసం సినిమా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. కాకపోతే ఇన్నాళ్లూ మనం తెలుగు తెరపై చూసిన మదర్ సెంటిమెంట్ సినిమాల్లాంటిది కాదని సమాచారం. హీరో క్యారెక్టరైజేషన్ కు, తల్లి పాత్రకు మధ్య మంచి క్లాష్ ఉంటుంది. ఆ క్లాష్ ఎంతగా అంటే ఒక దశలో తల్లికొడుకుల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ తిరిగి కలుసుకోలేనంత దూరం పెరిగిపోతుందట. అదే ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

డిఫరెంట్ కథల్ని ఎంచుకోవడం శ్రీవిష్ణు స్టయిల్ అన్న విషయం తన గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. రిజల్ట్ సంగతి తర్వాత. తిప్పరా మీసం సినిమాను కూడా అదే
ఆలోచనతో సెలక్ట్ చేసుకున్నాడు. కాకపోతే ఆర్థిక సమస్య తలెత్తడం వల్ల ఇన్నాళ్లూ ఈ సినిమా డిలే అయింది. బ్రోచేవారెవరురా సక్సెస్ తో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇక సినిమాలో శ్రీవిష్ణు తల్లిగా రోహిణి నటించగా, నిక్కీ తంబోలీ హీరోయిన్ గా నటించింది. ఇక శ్రీవిష్ణు సోలో హీరోగానే కాదు పాత్ర నచ్చితే యంగ్ హీరోస్ తో కూడా కలిసి నటించడానికి వెనకాడటం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: