గీతా ఆర్ట్స్‌లో సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు మోసం చేశారంటూ జూనియర్ ఆర్టిస్టు సునీత బోయ ఆరోపణలు సంచలనంగా మారాయి. గత రెండు రోజులగా ఫిలించాంబర్ గేటుకు సంకెళ్లతో బంధించుకుని నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. జనసేన ప్రచారానికి తనను వాడుకున్నారని, గీత ఆర్ట్స్, బన్నీ వాసు తనకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారని కానీ ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆమె వీడియో ద్వారా తెలిపింది. 


అయితే తాజగా ఈ విషయంపై నిర్మాత బన్నీ వాసు స్పందించి సంచలనం సృష్టించారు. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు ఆయన మొబైల్ లో ఒక సెల్ఫీ వీడియో ద్వారా వివరించారు. సునీత బోయ చేసే ఆరోపణలు నిజం కాదని, అనవసరంగా వారి పరువు తియ్యడానికే ఇలాంటి నిరసనలు చేస్తుందని తెలిపారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ సునీత సినిమాల్లో అవకాశాలు ఇప్పించమని కోరారని, తాను కూడా తనకు తెలిసిన వారికి ఆమె గురించి చెప్పి ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పాలని వారిని కోరినట్టు  తెలిపారు. 


కాగా జనసేన పార్టీలో పని చేస్తే సినిమాలో అవకాశాలు ఎలా ఇస్తారని, ఎవరైనా సినిమాల్లో అవకాశాలు పొందాలంటే ఆడిషన్స్‌లో పాల్గొని, ఎంపిక అవ్వాలని అయన సూచించారు. సునీత ప్రవర్తన వల్లే ఆమెకు వారు క్యారెక్టర్స్‌ ఇవ్వలేకపోయామని, ఒకవేళ ఆమెకు అవకాశం ఇచ్చినా ఆమె సెట్ లో ఎలా ప్రవర్తిస్తుందో అని భయమేసి ఆమెకు ఇవ్వలేదని తెలిపారు.


అయితే జరిగిన విషయాలు అన్ని తెలుసుకోకుండా మీడియా వాళ్ళు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆమె చెప్పింది కేవలం అవకాశాలు ఇవ్వడం లేదని కానీ మీడియా ఆమెను వారు లైంగికంగా వేధించారని రాస్తున్నారని అలాంటి వాటిలో నిజం లేదని, ఆమె చెప్పేవి అన్ని నిజాలు కావు అని నిర్మాత బన్నీ వాసు వీడియో ద్వారా తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: