ఇప్పటికే కృష్ణజింకల కేసుతో సతమతమవుతున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తనకి సంబంధించిన ఫోన్ లాక్కుని సల్మాన్ ఖాన్ తీవ్రంగా గాయపరచినట్లు సదరు జర్నలిస్ట్ అశోక్ పాండే ఆరోపిస్తున్నాడు. ఇటీవల తాను సైకిల్ పై వెళుతుండగా..రోడ్డుపై సల్మాన్ ఖాన్ కనిపిస్తే ఫోటోలు వీడియోలు తీయడం జరిగిందని అయితే ఆ ఫోటోలు వీడియోలు సల్మాన్ ఖాన్ బాడీ గార్డులు అనుమతి ఇస్తేనే తీయడం జరిగిందని అయితే ఆ సమయంలో వీడియోలు తీయడం సల్మాన్ చూసి తన వద్దకు వచ్చి ఫోన్ లాక్కుని తనపై దాడి చేశారని జర్నలిస్ట్ అశోక పాండే వివరించాడు.


అంతేకాకుండా ఫోన్ లో ఉన్న వీడియోలను డిలీట్ చేసి చాలా దారుణంగా సల్మాన్ ఖాన్ ప్రవర్తించాడని ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదని...ఖాకీల దగ్గర కూడా న్యాయం దొరకకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని తెలిపాడు జర్నలిస్ట్. అయితే ఈ ఘటన ఏప్రిల్ మాసంలో జరిగినట్లు వివరాల ద్వారా అర్థమవుతుంది. అయితే జరిగిన వివాదంలో గొడవలు సల్మాన్ ఖాన్ తో పాటు అతని బాడీ గార్డులు కూడా సదరు జర్నలిస్టు పై చేయి చేసుకున్నట్లు మరియు అదే విధంగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే డీఎన్ నగర్ పోలీసులు కేసు స్వీకరించని కారణంగా వారిపై కూడా విచారణ చేయాలని ముంబై అంధేరీ కోర్టు కి సదరు జర్నలిస్ట్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.


ఈ కంప్లైంట్ ను స్వీకరించి పోలీసులను విచారించాల్సిందిగా ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఈ విషయంలో నిజానిజాలు తేలాల్సివున్నాయి. జర్నలిస్టుని గాయపరిచినందుకు ఐపీసీ సెక్షన్ 323,ఫోన్ లాక్కున్నందుకు 392, నేరానికి పాల్పడినందుకు ఐపీసీ 506 సెక్షన్ల కింద కోర్టులో సల్మాన్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: