టాలీవుడ్ లో విలన్ పాత్రలు చేయాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాలన్నా ఒక్కరే గుర్తుకొచ్చేవారు. ఆయనే ప్రకాష్ రాజ్. తెలుగులో విలన్ పాత్రలతో పాటు, ఫాదర్ గా ఆయన చేసినవి కోకొల్లలు. కొన్ని కొన్ని సార్లు ప్రతీ సినిమాలో ప్రకాష్ రాజే కనిపించేవారు. తెలుగులో మరే నటుడు లేడనేంతగా తన ప్రభావాన్ని చూపగలిగారు. అయితే ఇప్పుడు మరో నటుడు ప్రకాష్ రాజ్ స్థానాన్ని తీసుకునేలాగా కనిపిస్తున్నాడు.


నటుడు మురళి శర్మ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. ఆయన టాలీవుడ్ దర్శక నిర్మాతల మొదటి ఛాయస్ అవుతున్నారు. గత రెండేళ్లుగా మురళి శర్మ దాదాపు అన్ని సినిమాలలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తండ్రి పాత్రలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. మహేష్ బాబు నటించిన "అతిధి" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మురళీ శర్మ విలన్ గానే కాకుండా విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు.


విలనిజం పండించడమే కాకుండా, కామెడీని పండించగల సమర్థుడు మురళీ శర్మ, మొన్న వచ్చిన సాహో సినిమాలో తనదైన స్టైల్ లో కామెడీని పండించాడు. అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఎక్కువ సినిమాలు చేయట్లేదు కాబట్టి, టాలీవుడ్ లో ఆ ప్లేస్ లోకి వెళ్ళే సామర్థ్యం ఉన్న వారిలో మొదటి వరుసలో కనిపిస్తున్న పేరు మురళీ శర్మనే ఉన్నారు. రావు రమేష్ గారు కూడా ఆ స్థానం కోసం పోటీ పడుతుండగా, ఎక్కువ ఛాన్స్ మురళీ శర్మకే ఉంది. 


బేసిక్ గా హిందీ వాడైన మురళి శర్మ చక్కగా తెలుగు మాట్లాడగలరు. అది కూడా ఆయనకు అవకాశాలు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భాష పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి దర్శక నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇస్తున్నారు. మరి ముందు ముందు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: