కులమే ఆయన శ్వాస అట. కులమే ఆయన ధ్యాస అట. నా స్నేహితులు, నా కుటుంబం, నా ఊరు, నా దేశం ఉన్నప్పుడు నా కులముంటే తప్పేంటంటూ ప్రశ్నిస్తున్నాడు. రాజ్యాంగ బద్దంగా దేశంలో కులాలు రాజ్యమేలుతుంటే నా కులం ఇదీ అని చెప్పుకుంటే తప్పేంటని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇది వినేందుకు మీకు వితండవాదంలా ఉంది కదూ వితండవాదానికి కేరాఫ్ వివాదాలకూ బూస్టప్ ఇచ్చాడు దర్శకుడు చేస్తున్న కామెంట్స్ ఇవి ఆయనే రామ్ గోపాల్ వర్మ. కమ్మ రాజ్యంలో కడప రెడ్లంటూ క్యాస్ట్ ఫీలింగ్ ను గొప్ప ఫీలింగ్ అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడా సినిమాతో ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు, ఎలాంటి వివాదాలు సృష్టించబోతున్నాడు.




రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబు వేస్తారో ఎవరూ ఊహించలేరు. తనకి ఏదనిపిస్తే అదే చేస్తా అంటూ నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టయిల్ లో షాక్ ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చం చంద్రబాబులాగే ఉన్న ఓ యాక్టర్ ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు వర్మ. తాజాగా కన్నీటితో ఉన్న చంద్రబాబు లుక్ బయటకు వదిలిన వర్మ ఈ సారి భారీ సంచలనానికి తెరలేపాడు. కన్నీటితో ఉన్న చంద్రబాబు లుక్ వదులుతూ నిజ జీవితంలో ఈ రోల్ ఎవరిదో చెప్పండి అంటూ ట్వీట్ చేశాడు.


దీంతో చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున రిప్లై లు పడుతూ ఉన్నారు నెటిజన్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. వాస్తవానికి సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వలేదు. ఊహించని విధంగా ఈ సినిమా సాంగ్ ను రిలీజ్ చేసి తన టార్గెట్ ఏంటో లిరిక్ రూపంలో చెప్పేశాడు వర్మా. ఇంకేముంది ఈ సినిమాపై ఇప్పటికే బోల్డంత వివాదము, వర్మ మార్క్ వినోదం స్టార్టైంది.


బ్రహ్మముహూర్తం టైమ్ లో కమ్మ రాజ్యంలో కడప రెడ్ల సాంగ్ ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన వర్మ ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా వున్నాడు. ఆ తరువాత ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన చిరంజీవి పుట్టిన రోజున మరోసారి తన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను తెరపైకి తెచ్చాడు. అచ్చం పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఓ యాక్టర్ ఫొటోని ట్విటర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఒక్క సారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. చంద్రబాబు లుక్ వెనుక చాలా అర్థం దాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు లుక్ పై నెటిజన్లు ఎవరి విశ్లేషణలు వాళ్లు ఇచ్చుకుంటున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత చంద్రబాబు పరిస్థితి ఇదీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇదే సినిమాలోని హైలైట్ పాయింట్ అవుతుందనీ కూడా తమకు తోచిన రీతిలో వాళ్లు విశ్లేషిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: