సినిమా రిలీజ్ కు మంచి డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే  దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు త్యర్వాతే ఎవరైనా. ఈ ముగ్గిరి ప్లానింగ్ అంతా వేరు. తమ సినిమాలకు మరే సినిమా పోటీలేకుండా, వరుసగా సెలవులు కలిసి వచ్చేలా డేట్ ను ఫిక్స్ చేసుకుంటారు. దాంతో సినిమాకు మినిమమ్ గ్యారంటీ వస్తుంది. ప్రస్తుతం సురేష్ బాబు, పీపుల్స్ మీడియా కలిసి వెంకీమామ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 4న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ సైరా ఎఫెక్ట్ ఎలా వుంటుందో తెలియదు కాబట్టి కాస్త వెనక్కి తగ్గి...వాయిదా వేసుకున్నారు. అలా తగ్గడం వల్లే ఇప్పుడు మాంచి డేట్ కుదిరింది.

దీపావళికి గనక సినిమాను రిలీజ్ చేస్తే శని, ఆదివారాలు, ఆ పక్కన దీపావళి, అదేవారంలో నాగులచవితి కలిసివస్తాయి. అంటే వారంలో నాలుగు రోజులు కనీసం సెలవులు వస్తున్నాయన్నమాట. ఇక వెంకీ మామ సినిమాకు బడ్జెట్ పరంగా కాస్త ఎక్కువే ఖర్చు పెట్టారు. సినిమాకు లోకేషన్లు, సెట్లు, యాక్షన్ సీన్లు ఎక్కువ వుండడంతో యాభై కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. అయితే దీంతో పాటు వెంకీ చైతూ ఇద్దరు స్టార్స్ ఉన్నారు కాబట్టి అదేమంత పెద్ద బడ్జెట్ కాదని కూడా చెప్పుకుంటున్నారు.

నాన్ థియేటర్ హక్కుల సంగతి ఎలావున్నా, మంచి రెవెన్యూ రావాలి అంటే ఇలాంటి డేట్ ఖచ్చితంగా అవసరం. పైగా ఈ డేట్ కు పోటీ వచ్చే సినిమా ఏదీ కూడా దరిదాపుల్లో కనిపించడంలేదు. అందువల్ల వెంకీమామ రిలీజ్ ప్లాన్ అయితే బావుంది. ఇక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఈ నాలుగురోజుల్లోనే మంచి వసూళ్ళు సాధించడం గ్యారెంటి.  ఎందుకంటే వెంకీ ఎఫ్2 తో నాగచైతన్య మజిలి తో మాంచి కమర్షియల్ సక్సస్ ను అందుకొని ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: