తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందుతున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే వారం వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్నారు. కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా శిల్పా చక్రవర్తి హౌస్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ లో నామినేషన్ అంటే అందరూ టెన్షన్ పడతారు. ఎవ్వరైనా నామినేషన్స్ లో ఉండకపోతేనే బాగుండును అనుకుంటారు.


కానీ నామినేషన్స్ లోకి రాకపోవడం కూడా ప్రమాదకరమే. ఇప్పుడు ఆలీ పరిస్థితి అలాగే ఉంది. ఆలీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాస్క్ లలో వందశాతం ఎఫర్ట్ పెడతాడు. కానీ ఆలీ ఎలిమినేట్ అవబోతున్నాడనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఆలీ ఇంతవరకు నామినేషన్స్ లో లేకపోవడమే. ఒక్కసారన్నా నామినేషన్స్ లోకి వచ్చి ఉంటే ఆయనకి అభిమానులు ఏర్పడి ఉండేవారు.


ప్రేక్షకులతో బాండింగ్ ఏర్పడాలంటే నామినేషన్స్ లో ఉండాలి. ఓటేసే ప్రతీ ప్రేక్షకుడు తను ఓటేసిన కంటెస్టెంట్ ఇంటి నుండి వెళ్ళకూడదని కోరుకుంటాడు. ఆ విధంగా ఆ కంటెస్టెంట్ పై అభిమానాన్ని పెంచుకుంటాడు. హౌస్ లో తను అభిమానించే కంటెస్టెంట్ బాగా పర్ ఫార్మ్ చేయాలని అనుకుంటాడు. సరిగ్గా పర్ ఫార్మ్ చేయకపోతే నిరాశకి గురవుతాడు.హౌస్ మేట్స్ అందరూ తను అభిమానించే కంటెస్టెంట్  ని టార్గెట్ చేస్తుంటే అపుడు మరింత సపోర్ట్ చేస్తాడు.


ఎట్టకేలకు ఆ కంటెస్టెంట్ ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. రాహుల్ విషయంలో ఇలాగే జరుగుతుంది. ప్రతీ వారం నామినేషన్స్ లో ఉంటున్నప్పటికీ సేవ్ అవుతూనే ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలా? లేదా అనేది డిసైడ్ చేసేది ఓట్లేసే ప్రేక్షకులే కానీ హౌస్ లో తమతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే నామినేషన్స్ లోకి రావాలి. అప్పుడే మన కెపాసిటీ ఏంటనేది అర్థం అవుతుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: