Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 12:18 pm IST

Menu &Sections

Search

'అల వైకుంఠపురములో'..  టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

'అల వైకుంఠపురములో'..  టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !
'అల వైకుంఠపురములో'..  టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'అల వైకుంఠపురములో'..  ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,  తన  స్టైలిష్ లుక్ తో మొత్తానికి అభిమానులను ఫిదా చేశాడు.  వెరీ స్టైలిష్  సూట్ లో బ‌న్నీ సిగ‌రెట్ కాలుస్తూ  వచ్చిన,  ఆ ఫస్ట్ లుక్  పోస్టర్  సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది.  అయితే తాజాగా బన్నీ టీజర్ తో కూడా రాబోతున్నాడు. నవంబర్ 7న  ఈ సినిమా  టీజర్ ను  విడుదల చేయబోతున్నారు. ఆ రోజు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.  వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఇక  ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా..  శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  మొత్తానికి ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా  రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని ఫిల్మ్ నగర్ టాక్.   బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ,   ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో  రాబోతున్నారు. అందుకే ఈ సినిమాకి   ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు.   ఇక ఈ సినిమలో బన్నీ సరసన  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది.  పూజా హెగ్డే ఇప్పటికే  డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది.  అలాగే ఈ సినిమాలో  సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా  కీలక పాత్రలో  నటిస్తోంది.   


కాగా  తమన్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  ఈ  సినిమాలో త్రివిక్రమ్ కామెడీ  హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట.  ముఖ్యంగా వెన్నల కిషోర్ కోసం  అద్భుతమైన పాత్రను రాశాడట.   సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీకి - కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయని..   అలాగే  సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే  సీక్వెన్స్ లో కూడా  కిషోర్  పగలబడి నవ్వేలా కామెడీ చేస్తాడట. దీనికితోడు  సినిమాలో అల్లు అర్జున్ ను  త్రివిక్రమ్ కాస్త వైవిధ్యంగా  చూపించబోతున్నాడని సమాచారం.  కాగా ఇప్పటికే ఈ సినిమాకి తమన్,  ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట.  బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో  ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని  తెలుస్తోంది.  ఇక ఈ సినిమాలో  త్రివిక్రమ్ కి కామెడీ డైలాగ్ లు రాయడంలో హైపర్ ఆది హెల్ప్ చేస్తున్నాడు.  అయితే కేవలం ఒక క్యారెక్టర్ కి మాత్రమే హైపర్ ఆది డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ను కూడా హైపర్ ఆదినే చేస్తున్నాడు.  మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ బన్నీకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుకపడిన బన్నీ ఈ సినిమా పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి.          

  


Allu Arjun, the stylish star with the first look poster, has captivated the fans with his stylish look. The first look poster of a bunny cigarette burning in a very stylish suit went viral on social media.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
'భారతీయుడు 2'తో  'గ్యాంగ్ లీడర్' బ్యూటీ !
అరె  అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా ?
కోడెల మృతిని బాబులిద్దరూ బాగానే వాడుకుంటున్నారు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
శనివారం నాటికి  'సైరా'  సై..సై..  !
కీరవాణికి పని తగ్గించిన రాజమౌళి !
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జాన్' పై  ఫోకస్  పెట్టిన  ప్రభాస్ !
'భీష్మ' కోసం నితిన్ చెప్పేశాడు  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.