మాములుగా ఏ స్టార్ హీరో సినిమా ఛాన్స్ వచ్చినా సరే దర్శకులు ఎగిరి గంతేస్తారు. సీనియర్ స్టార్ హీరోలతో అయితే ఇంకా సూపర్ అనుకుంటారు. అయితే లేటెస్ట్ గా ఓ స్టార్ డైరక్టర్ సీనియర్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ సినిమా ఆఫర్ ఇస్తానన్నా వద్దని అంటున్నాడట. బాలయ్య లాంటి హీరో సినిమా చేస్తానని చెబుతున్నా కాదనడం విశేషం.


100 సినిమాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణ తన సినిమాల వేగం పెంచాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న బాలయ్యతో సినిమా అంటే రిస్క్ అనేస్తున్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య ఈమధ్య సత్తా చాటడంలో వెనుకపడ్డాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు బాలయ్య బాబు.


ఆ సినిమా తర్వాత స్టార్ డైరక్టర్ కు కబురు పంపినా అతను మాత్రం బాలయ్యతో సినిమా చేయడానికి సుముఖంగా లేడని తెలుస్తుంది. తేడా ఎక్కడ వచ్చిందో తెలియదు కాని బాలకృష్ణతో సినిమా అంటే డైరక్టర్స్ ముదుకు రావట్లేదు. అందుకే బాలయ్య బాబు యంగ్ డైరక్టర్స్ కు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతకుముందు అనీల్ రావిపుడి లాంటి దర్శకులు బాలకృష్ణతో సినిమా ట్రై చేశారు.


అయితే ప్రస్తుతం అనీల్ రావిపుడి మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు కాబట్టి అతను కాకుండా మరో దర్శకుడితో సినిమా చేయాలని చూస్తున్నాడ బాలయ్య. ఎలాగు రవికుమార్ సినిమా సంక్రాంతికి పూర్తవుతుంది. అయితే 2020 పొంగల్ రేసులో ఉంటుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న బాలకృష్ణ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అయినా బాలయ్యను మళ్లీ ఫాం లోకి తెస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: