మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ "సైరా నరసింహారెడ్డి" సినిమా ప్రపంచ వ్యాప్తంగా విదుదల కావడానికి ముస్తాబు అవుతుంది. సైరా ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దాదాపు 250 కోట్లతో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ని తెలుగు,తమిళ్ ,హిందీ భాషల్లో ఒకే సారి రిలీజ్ అవుతుంది.

"సైరా నరసింహారెడ్డి" సినిమా 1846 నాటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా.ఈ సినిమాలో అందాల తార అనుష్క ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో కనిపించనుంది. సైరా సినిమా అనుష్క పాత్ర వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది మళ్లీ చివర్లో ఆమె వాయిస్ తోనే సినిమా ఎండ్ అవుతుంది.

సైరా సినిమాలో ఒళ్ళు గగుర్పొడిచే  అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్  ఉంది. ఈ ఫైట్ ను ముంబాయిలో షూట్ చేశారు.ఈ ఫైట్  సీక్వెన్స్ ను  మెగాస్టార్ చిరంజీవి స్వతహగా చేశారు. ఏలాంటి డుప్ ని వాడలేదు.ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చు చేశారు.

మెగాస్టార్ సినిమా అంటేనే మాస్ ప్రేక్షకులకు పండగ.ఆయన చేసే డ్యాన్స్ కోసం అందరు ఎదురు చూస్తారు వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఒక జాతర సాంగ్ తెరకెక్కించారు. ఆ పాటలో మెగాస్టార్  డ్యాన్స్ ఇరగదీసారని సమాచారం.

మెగాస్టార్  సినిమాలో డ్యాన్స్ మరియు డైలాగ్స్  ఓ రెంజ్ లో ఉండాల్సిందే. జాతర పాటలో డ్యాన్స్ అలరించనుంది.సినిమా మొదటి నుండి చివరి వరకు మెగాస్టార్  నోటి నుండి వచ్చే డైలాగ్స్ కి అందరికి గుజ్ బౌన్స్ గ్యారంటి అంటున్నారు చిత్ర యూనిట్.

సైరా లో ప్రీ క్లయిమాక్స్  చాలా ముఖ్యం కాబట్టి  దాని కోసం చాలా ఖర్చు చేస్తున్నారని సమాచారం. . ఉయ్యాల వాడ నరసింహారెడ్డి  జన్నించిన కర్నూల్ ప్రాంతంలో  ప్రీ-రిలీజ్ ఇవెంట్ ని భారీ రెంజ్ లో నిర్వహిస్తున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: