టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు.  మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేదు.  క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  అంతే కాదు ఈ మూవీ జాతీయ స్థాయిలో అవార్డు కూడా గెల్చుకుంది. దాంతో వరుణ్ తేజ్ కి మంచి క్రేజ్ వచ్చింది.  ఈ యూవీ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’సినిమాతో వచ్చాడు..కానీ ఈ మూవీ కూడా హిట్ కాలేదు. 

అయితే ఈ మూవీతో వరుణ్ తేజ్ మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫిదా’, 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌2' అంటూ ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు వరణ్ తేజ.   తాజాగా వరుణ్‌తేజ్‌ హీరోగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ మూవీ 'వాల్మీకి'.   ఈ గ్యాంగస్టర్ కామెడీ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయటానికి దర్శక, నిర్మాతలు నిర్ణయించారు.   ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ‘గద్దలకొండ గణేష్’ ఇది వాల్మికి మూవీలో ఆయన పాత్ర పేరు. ఈ క్యారక్టరే కాదు..లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. 


ఈ సినిమాని త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ జిగ‌ర్తాండ‌కు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నార‌ు.  కథ ప్రకారం ...ఓ దుర్మార్గుడైన  రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే.  ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు.    గతంలో ఈ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి.  జిగర్తాండ తమిళ వెర్షన్ కి `పిజ్జా` ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. 

ఈ సినిమా లో సిద్ధార్థ్, బాబీసింహా హీరోలుగా నటించారు.  ఈ మూవీలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు.  1980 నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ మూవీ కనిపిస్తుంది.  ఈ  మూవీకీ సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: