Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 11:31 pm IST

Menu &Sections

Search

నిర్మాతగా మారాక నిజమైన మెగాస్టార్ ని కలినట్లుగా అనిపించింది....!!

నిర్మాతగా మారాక నిజమైన మెగాస్టార్ ని కలినట్లుగా అనిపించింది....!!
నిర్మాతగా మారాక నిజమైన మెగాస్టార్ ని కలినట్లుగా అనిపించింది....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై దాదాపుగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి వీక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ ని సంపాదించడం జరిగింది. 

అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో అదరగొట్టిన సైరా టీజర్, సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. ఇక అతి త్వరలో ప్రి రిలీజ్ వేడుకను జరుపుకోనున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, అనుష్క, తమన్నా, నిహారిక కొణిదెల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే నేడు నిర్మాత రామ్ చరణ్, తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, 

'నాన్న గారు సైరా సినిమాలో నరసింహారెడ్డి గారి పాత్ర కోసం ఎంతలా తనను తాను మలుచుకున్నారో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. నిర్మాతగా మారిన తరువాత ఆయన వంటి నిజమైన మెగాస్టార్ ని తొలిసారి కలిసినట్లుగా అనిపిస్తోంది' అంటూ చరణ్ ఒక పోస్ట్ చేసారు. అంతేకాక ఆ పోస్ట్ తో పాటు, నరసింహారెడ్డి గారి లుక్ లో ఉన్న తండ్రి మేకప్ ని సరిచేస్తున్న స్టిల్ ని చరణ్ పోస్ట్ చేయడం జరిగింది. కాగా చరణ్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మరి ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతవరకు ఆ అంచనాలు అందుకుంటుందో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే..!!


ram charan post about his father megastar in syeraa movie look
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వాల్మీకి : వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో.....!!
వాల్మీకి : వరుణ్, హరీష్ ల వండర్ఫుల్ మ్యాజిక్.....!!
వాల్మీకి : పవన్ లోటు భర్తీ అయినట్లే.....!!
'వాల్మీకి' : 'గబ్బర్ సింగ్' ని గుర్తుచేసిన హరీష్.....!!
వాల్మీకి : మాస్ మెగాస్టార్ ని గుర్తు చేసాడు....!!
వాల్మీకి : 'వరుణ్ తేజ్' నట విశ్వరూపం....!!
వాల్మీకి : గద్దలకొండ గణేష్, శ్రీదేవి అదరగొట్టారహే....!!
'వాల్మీకి' : 'గద్దలకొండ గణేష్' గత్తర లేపిండు.....!!
వాల్మీకి : పూరీ టేకింగ్, వర్మ లొకేషన్లు, వైట్ల కామెడీ, వరుణ్ భయంకర యాక్టింగ్ !
వాల్మీకి: పూజ హెగ్డే భలే సూటయ్యందే ?
వాల్మీకి (గద్దలకొండ గణేష్) : స్టార్ హీరోల లిస్టులో వరుణ్ తేజ్ కన్ఫర్మడ్ !
వాల్మీకి( గద్దలకొండ గణేష్ ) : హేమచంద్ర డబ్బింగ్ తేడా కొట్టేసిందా ?
'సైరా' ట్రైలర్ పై మహేష్ బాబు సంచలన కామెంట్స్.....!!
ఫస్ట్ షో టాక్ : వరుణ్ తేజ్ 'వాల్మీకి'
వామ్మో 24 గంటల్లో అన్ని లక్షల వ్యూసా....!!
ఆ డిస్ట్రిబ్యూటర్లకు షాకివ్వనున్న గ్యాంగ్ లీడర్.....??
వరుణ్ తేజ్ 'వాల్మీకి' టైటిల్ మార్పు వల్ల నష్టం ఎంతంటే....??
'బాహుబలి' తో పోలిస్తే 'సైరా' కు దెబ్బేసేది అదే.....!!
సెన్సార్ టాక్ : వరుణ్ తేజ్ 'వాల్మీకి'...!!
షాకింగ్ రేంజ్ లో నయనతార రెమ్యునరేషన్....??
వరుణ్ తేజ్ 'వాల్మికి' లో యంగ్ హీరో స్పెషల్ అపియరెన్స్......!!
గ్యాంగ్ లీడర్ కి ఊహించని గట్టి షాక్......!!
వామ్మో 'ఆర్ఆర్ఆర్' నైజాం హక్కులు అంత పలికాయా.....!!
సినిమా మొత్తం ఒక ఎత్తైతే, అది మాత్రం మరొక ఎత్తట.....!!
బ్రహ్మానందం రీఎంట్రీ ఆ సినిమాతోనేనా....??
నెక్స్ట్ బిగ్ బాస్ హోస్ట్ గా సూపర్ స్టార్....??
పాయల్ అందాలకు ఆ స్టార్ హీరో ఫిదా.....??
చిన్నదే అయినా ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందట.....!!
ట్రైలర్ రిలీజ్ తరువాత 'సైరా' పై అంచనాలు మారిపోయాయిగా.....!!
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి షాకింగ్ రోల్......??
పవన్ ఫ్యాన్స్ కు ఖుషి న్యూస్ చెప్పిన రామ్ చరణ్.....!!
విజువల్ వండర్ గా మెగాస్టార్ చిరంజీవి 'సైరా' ట్రైలర్.....!!
'సైరా' పని అయిపోయినట్లే.....!!
బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్...??
కోడెల ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు.....??
ఇంక మహేష్, బన్నీ లే మిగిలారు.....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.