బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో 7వ వారం ఎవరు ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న అలి రెజా ఎలిమినేట్ అయ్యాడు. టాస్కుల్లో సత్తా చాటుతూ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న అలి రెజా బయటకు వస్తాడని ఎవరు ఊహించి ఉండరు. అయితే ఊహించినది జరిగితే అది బిగ్ బాస్ ఎలా అవుతుంది.


అలి రెజా ఎలిమినేషన్ తో ఇంటి సభ్యులంతా బాగా ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో అతనితో గొడవపడే రాహుల్ కూడా అలి ఎలిమినేషన్ అనగానే బోరున ఏడ్చేశాడు. ఇంతకీ అలి ఎందుకు హౌజ్ నుండి బయటకు వచ్చాడంటే. హౌజ్ లో అలి చేస్తున్న టాస్కులు బాగున్నా అతని యాటిట్యూడ్ కొంతమంది ఇంటి సభ్యులను ఇబ్బంది పెడుతుంది.


ముఖ్యంగా అలితో గొడవపడుతున్న రాహుల్, మహేష్, పునర్నవి అలి మీద ఇవే కారణాలతో ఎలిమినేట్ చేశారు. అందరు టాస్క్ ఆడుతున్నారు అలి రెజా కూడా ఆ టాస్క్ లో తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాడు. అయితే ఏదో ఒక క్షణంలో అతని ప్రవర్తన చాలా రూడ్ గా ఉంటుందని ఇంటి సభ్యులు చెప్పారు. అంతేకాదు శ్రీముఖికి ఫేవర్ గా అతని ఆట ఉందన్న వార్తలు వచ్చాయి.   


మరో విశేషం ఏంటంటే ఈ ఆరు వారాల్లో అలి ఇంతవరకు నామినేట్ అవలేదు. నామినేట్ అయిన మొదటిసారి ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్ లో మొదటిసారి నామినేట్ అయిన వారంతా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అలి రెజాతో అది లాస్ట్ అని తెలుస్తుంది. అలి రెజా ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఒకవేళ అలి కొనసాగితే అతనే టైటిల్ విన్నర్ అవుతారని అనుకున్నారు. కాని అతను ఇలా సడెన్ గా హౌజ్ నుండి బయటకు వస్తాడని ఎక్స్ పెక్ట్ చేయలేదు. సో ప్రతివారం నామినేషన్, ఎలిమినేషన్ బిగ్ టాస్క్ లానే ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: