Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 5:40 am IST

Menu &Sections

Search

ఇస్రోని ప్ర‌శంసిస్తూ ‘నిన్ను తలచి’ఆడియో విడుద‌ల‌

ఇస్రోని ప్ర‌శంసిస్తూ ‘నిన్ను తలచి’ఆడియో విడుద‌ల‌
ఇస్రోని ప్ర‌శంసిస్తూ ‘నిన్ను తలచి’ఆడియో విడుద‌ల‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్  నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం నిన్ను తలచి.  క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాతో వంశీ యాకసిరి, స్టెఫీ పటేల్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. . ప్రొడక్షన్,  పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుద‌ల‌చేస్తున్నట్లు గా నిర్మాతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఫిల్మిఛాంబ‌ర్‌లో ఈ చిత్రంలోని 3వ‌పాట‌ను విలేక‌రుల స‌మావేశంలో విడుద‌ల చేసి అనంత‌రం చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.


హీరో వంశీ మాట్లాడుతూ... ముందుగా ఇస్రో టీమ్ చంద్ర‌యాన్‌2 ని అప్రిసియేట్ చెయ్యాలి. వాళ్ళ‌కి ముందుగా కంగ్రాట్స్‌ద‌. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే మా చిత్రం ఈ నెల 27న విడుద‌ల‌కానుంది. ఏమో ఏమ‌యిందో అన్న సాంగ్ చాలా బావుంది. నాకు ఈ చిత్రంలో మ‌రో సాంగ్ కూడా ఇష్టం టైటిల్ సాంగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కునికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నేను, ఈ చిత్ర హీరోయిన్ మెట్రో ప్ర‌యాణికుల‌తో క‌లిసి ప్ర‌యాణించి వాళ్ల‌కు గిఫ్ట్ కార్డులు అంద‌జేశాము. మా హీరోయిన్ చాలా మంచిది వాళ్ళ‌తో బాగా క‌లిసిపోయి ప్ర‌మోష‌న్స్‌కి బాగా హెల్ప్ అయింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మా ఇద్ద‌రి పెయిర్ బావుంద‌ని అంటున్నారు. అలాగే సినిమాటోగ్ర‌ఫీని కూడా మెచ్చుకుంటున్నారు. ప్ర‌మోష‌న్స్ కోసం కాలేజీల‌కు కూడా వెళుతున్నాము. ఆల్రెడీ భీమ‌వ‌రం, వైజాగ్ కాలేజీల‌కు వెళ్లాము. నా కో -ఆర్టిస్ట్ అయిన స్టెఫీకి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


హీరోయిన్ స్టెఫీ ప‌టేల్ మాట్లాడుతూ... ఇప్పుడు విడుద‌ల చేసిన పాట నాకు బాగా న‌చ్చింది. మీ అంద‌రికి కూడా న‌చ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ పాట షూటింగ్ అంతా అర‌కులో తీశారు. అలాగే ఇస్రో టీమ్ అంద‌రికీ మా కంగ్రాట్స్‌. విక్ర‌మ్ తిరిగి త్వ‌ర‌గా రావాల‌ని కోరుకుంటున్నాను. వంశీ, నేను ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్నాం.చాలా బావుంది. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ అనిల్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీ చాలా బావుంటుంది. నా కో ఆర్టిస్ట్ వంశీ చాలా మంచి వారు. నాకు తెలుగు భాష అర్ధ‌వ‌వడం కోసం చాలా హెల్ప్ చేశారు. మేమిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అలాగే మా సినిమాకి మంచి స‌పోర్ట్‌ని ఇస్తున్న బ‌న్నీవాసుగారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్‌తోట మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు పాట‌లు విడుద‌ల‌య్యాయి. అన్నీ మంచి హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి నాలుగు పాట‌లు పూర్ణ రాశారు. చాలా బాగా రాశారు. ఇందులో నాకు న‌చ్చింది నిన్ను త‌ల‌చి పాట‌. మా చిత్రానికి చేసిన ఆర్టిస్ట్‌ల‌కు, టెక్నీషియన్స్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. మా చిత్రానికి ఇంత మంచి స‌పోర్ట్ ఇస్తున్నందుకు బ‌న్నీవాసుగారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


పూర్ణ లిరిక్ రైట‌ర్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాతో మొత్తం నాలుగు పాట‌లు రాయించారు. అన్నీ చాలా బాగా వ‌చ్చాయి. ఏలేంద్ర‌గారు మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాని చిన్న సినిమాగా మేము భావించ‌డంలేదు. త‌ర్వాత టైటిల్ సాంగ్ విడుద‌ల చేస్తారు. ఒక పాట‌కి కావ‌ల‌సిన సాహిత్యాన్ని అందించాను. నా నుంచి అలా మంచి సాహిత్యాన్ని రాబ‌ట్టిన అనిల్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. నేను ఎన్నో చిత్రాల‌కు ప‌ని చేశాను. కాని అనిల్‌గారు నానుంచి మంచి సాహిత్యాన్ని రాబ‌ట్టారు అది అంద‌రి ద‌ర్శ‌కుల‌కు రాదు. నాకు ఆయ‌న ద‌గ్గ‌ర కంఫ‌ర్ట్‌గా అనిపించింది. చాలా చ‌క్క‌టి ప‌దాలు చిన్న చిన్న ప‌దాలు అర్ధ‌వంతంగా రాశాను. మా చిత్రంలోని వంశీ, స్టెఫీ పెయిర్ బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. సినిమాలో ఎక్క‌డా వీళ్ళు కొత్త‌వాళ్ల‌లాగా క‌నిపించ‌రు. ఈ సినిమా ఇంత దూరం రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన బ‌న్నీవాసుగారికి మా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


isroni prasamsisthu ninnutalachi audio vidudala
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
`ఉల్లాలా ఉల్లాలా`రొమాన్స్ ఎలా ఉండ‌బోతుంది?
అఖిల్ తో పూజా రొమాన్స్‌... మ‌రీ అంత పారితోషిమా...?
షూటింగ్‌కి రెడీ అంటున్న స‌మంత‌
రాయలసీమ లవ్ లో అంత ప‌వ‌ర్ ఉందా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.