రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సాహో సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో డైరెక్టర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని డీల్ చేయడమంటే మాటలు కాదు. కనీసం ఓ 5 సినిమాల అనుభవం ఉన్నా కూడా ఇంత పెద్ద రిస్క్ మరే డైరెక్టర్ చేయలేడేమో. కానీ సుజిత్ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. కథ, కథనాలు బలంగా రాసుకోనప్పటికి సినిమాని మాత్రం హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు. . మూడు గంటల సాహోలోని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం వందలాది మంది సభ్యుల యూనిట్ పడిన కష్టాన్ని చూపించే దాదాపు తొమ్మిది నిమిషాల వీడియో ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. సాహో సినిమా విశేషాలు ఇప్పటికే అందరికి తెలుసు. 

సాహో కోసం ఎంత ఖర్చు చేసారో? విదేశాల్లో తీసిన యాక్షన్ సీన్ల కోసం ఎన్ని భారీ వాహనాలు తయారు చేసారో, అన్నీ కొంత వరకే తెలుసు. ఇప్పుడు ఆ విషయాలను ఆ వీడియోలో  అలా అలా చూస్తుంటే, చిత్ర బృందం పడిన కష్టం తెలుస్తోంది. చాలామంది నిపుణులు, వేలాది గంటల పని, ఆలోచనలు, విజువలైజేషన్, గ్రాఫిక్స్ వర్క్, అన్నింటికి మించి కోట్ల ఖర్చు ఇవన్నీ క్లియర్ గా ఆ మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నాయి. వీడియోలు షాట్స్ అన్నీ చూస్తుంటే, సాహో చూడాలనే ఆసక్తి పెంచేలా వున్నాయి. కానీ ఇప్పటికే జనాలు ఆ సినిమాను చూసేసారు. ఈ వీడియోను గనక సినిమా రిలీజ్ చేసే వారం ముందు గనక వదిలి ఉంటే రీచబులిటి వేరేలా ఉండేది.

అందువల్ల ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే, ఆ షాట్స్ ప్రెజెంట్ చేసిన తీరు, దానిచుట్టూ అల్లకున్న కథ, దాన్ని వివరించిన తీరు గుర్తుకువచ్చి బాధేస్తుంది. ఇంత మంచి టెక్నికల్ వర్క్ వృధా అయిందే అన్న ఆలోచన అందరిలోను కలుగుతుంది. మొత్తంమీద సాహో సినిమాను మరోసారి గుర్తు చేయడంలో మాత్రం సక్సెస్ అయింది ఈ మేకింగ్ వీడియో. ఒకవేల ఎవరైనా ఈ మేకింగ్ వీడియో చూసి మరో సారి థియోటర్స్ కి వస్తారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: