బాలీవుడ్ లో సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్క హిందీ మాత్రమే కాదు తమిళం, కన్నడ, మళయాళ సినిమాలను కూడా ఎన్నో రీమేక్ చేసి సక్సస్ ని అందుకున్నారు. అందుకే వైవిధ్యమైన సినిమాలను ఎప్పుడు తెలుగువాళ్లు ఆదరిస్తారు అన్న నమ్మకం గట్టిగా ఏర్పడింది. హీరోయిజం, వాణిజ్యపరమైన అంశాలు వున్న సినిమాలను చూస్తూనే, వైవిధ్యమైన కథాంశం వున్న సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే నిర్మాత దిల్ రాజు ఓ హిందీ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నారు.

హిందీలో సూపర్ హిట్ అయిన 'బధాయి హో' సినిమాను తెలుగులో నిర్మించబోతున్నారు. హిందీ నిర్మాత బోనీకపూర్ తో కలిసి ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో నిర్మిస్తారని లేటెస్ట్ అప్‌డేట్. బోనీకపూర్ ఈ మధ్య ఎక్కువగా సినిమా నిర్మాణాల మీద దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు బాగానే ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. ఎటూ దిల్ రాజు తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. అలానే బాలీవుడ్ లో కూడా సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకోవాలని సన్నాహాలు చేసుకుంటున్నాడు.  

అందులో భాగంగానే ఇప్పుడు బధాయి హో సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. మధ్యతరగతి నేపథ్యంలో మాంచి ప్రేమకథను రన్ చేస్తూ తీసిన బధాయి హో తెలుగులో కూడా మాంచి యూత్ టచ్ వున్న ఫ్యామిలీ సినిమాగా తీయాలనే ఆలోచన చేస్తున్నారట దిల్ రాజు. నాగచైతన్య వంటి హీరోను సెలెక్ట్ చేసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి నాగ చైతన్య తో ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అవుతుందా లేక వేరే యంగ్ హీరోను ఫైనల్ చేసుకుంటాడా అనేది కొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: