సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడీ కృష్ణుడు సినిమాతో టాలీవుడ్ కి నటిగా అరంగేట్రం చేసిన విజయశాంతి, ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ, అనతికాలంలోనే అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. కృష్ణ, శోభన్ బాబు గారి తరువాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో చాలా సినిమాల్లో నటించిన విజయశాంతి, తన ఆకట్టుకునే నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించడం జరిగింది. అంతేకాక అప్పట్లో పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకున్న విజయశాంతి గారు, లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే పేర్లు సంపాదించారు. అయితే 2006లో వచ్చిన నాయుడమ్మ సినిమాతో తన సినీ జీవితానికి బ్రేక్ ఇచ్చిన విజయశాంతి గారు, ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. 

ఇక మళ్ళి 13 ఏళ్ళ తరువాత ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి గారు, తప్పకుండా ఆ సినిమా తనకు మంచి బ్రేక్ ని ఇస్తుందని అంటున్నారు. నేడు ఒక జాతీయ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన విజయశాంతి గారు మాట్లాడుతూ, కొన్నేళ్లపాటు విశ్రాంతి లేకుండా రాజకీయాల్లో గడిపిన తనకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు కూడా ముగియడంతో కొంత ఖాళీ సమయం దొరికిందని, అందుకే మళ్ళి సినిమాల్లోకి రావడం జరిగిందని అన్నారు. అయితే మధ్యలో తనకు మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ, రాజకీయాల్లో పూర్తిగా బిజీ అవడం వలన వాటిని అంగీకరించలేదన్నారు. ఇక ఇటీవల అనిల్ రావిపూడి గారు చెప్పిన కథ తనకు నచ్చడంతో పాటు, 

అందులో తన క్యారెక్టర్ ఎంతో ఎగ్జైట్ చేసిందని అందుకే ఒప్పుకున్నానని, తప్పకుండా సినిమా కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. చిన్నపుడు మహేష్ కు తల్లిగా కొడుకు దిద్దిన కాపురంలో చేశాను, మళ్ళి దాదాపుగా 30 ఏళ్ళ తరువాత ఆయనతో నటిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎంతో ఎత్తుకు ఎదిగి సూపర్ స్టార్ హోదాలో కొనసాగుతున్నప్పటికీ మహేష్ బాబులో ఏ మాత్రం భేషిజం, గర్వం లేకపోవడం గొప్ప విషయం అన్నారు. ఇక ఇటీవల సమాజంలో ఆడవారిపై దాడులు మరింతగా పెరిగిపోయాయని, నిజానికి తాము సినిమాలు చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలు ఉన్నట్లు దాఖలాలు లేవని, ఒకరకంగా ఆడవారిపై మరింతగా దాడులు జరగడానికి నేటి సోషల్ మీడియా ముఖ్య కారణం అని, 

కొందరైతే అసభ్య పదజాలంతో ఆడవారిని దూషిస్తుండడం ఇటీవల తాను చూశానని, స్త్రీలను ఆ విధంగా దూషించడం దారుణం అని ఆమె అన్నారు. సినిమాలు, టివి షోలకు మాదిరి సోషల్ మీడియా పై ప్రభుత్వ నియంత్రణ కలిగి ఉండాలని, అప్పుడే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడానికి అడ్డుకట్టపడుతుందని, ఆ విధంగా కొంతవరకైనా మహిళలపై దాడులు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. నిజానికి విజయశాంతి గారు చెప్పిన విషయం మంచిదేనని, మరి ఆ అంశాన్ని మన ప్రభుత్వాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయి అనే దానికి కాలమే సమాధాం చెప్పాలంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: