అప్పట్లో లైఫ్ ఆఫ్ పై సినిమా కోసం దర్శకుడు ఆంగ్లేయ గ్రాఫిక్స్ లో పెద్దపులిని సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆస్కార్ లు కొల్లగొట్టిన చిత్రమది, సినిమా ఆద్యంతం ఆ పులిదే ప్రధాన పాత్ర . అయితే అంత పెద్ద పాత్ర కాదు కానీ అదే తరహాలో యానిమేషన్ విజువల్ గ్రాఫిక్స్ సాయంతో ఓ పెద్దపులిని క్రియేట్ చేసి తెరపై అబ్బో అనిపించేలా చేయబోతున్నారట ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి . అయితే ఈ పులితో ఫైట్ చేసేదెవరు అల్లూరి సీతారామరాజు ఆ లేక కొమరం భీమా అంటే అది ఇప్పటికీ సస్పెన్స్.


వీరుడు అల్లూరితో కలిశాక ఆ ఇద్దరూ కలిసి పులితో పోరాడతారని స్పెక్యులేషన్ వినిపిస్తోంది. ప్రస్తుతం బల్గేరియాలో చిత్రీకరణ సాగిస్తున్నారు . అక్కడే పులితో పోరాడే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్ లను బరిలో దించాలని చెబుతున్నారు . జక్కన్న ప్లాన్ చూస్తుంటే ఈ సారి కూడా పాన్ ఇండియా లెవల్లో గట్టిగానే ప్లాన్ చేశాడని అర్థమవుతోంది . పూలతో పోరాటాలు అంటే గ్లాడియేటర్ చిత్రంలో రస్సెల్ క్రో గుర్తొస్తాడు .


నాలుగు వైపుల నుంచి పులులు మీదికి ఉరుకుతుంటే శత్రువుతో పోరాడాలి . అక్కడ గ్రాఫిక్ పులినే ఉపయోగించారు . ఆ తర్వాత మళ్లీ లైఫ్ ఆఫ్ పై చిత్రంలో గ్రాఫిక్స్ పులి అద్భుతంగా కుదిరింది . మరి ఈ సారి అల్లూరి కొమురం భీం పులితో పోరాటమంటే ఆ లెవల్ లోనే గ్రాఫిక్స్ పులిని క్రియేట్ చేస్తారేమో చూడాలి . బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ తరహాలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించి తరవాత గ్రాఫిక్స్ పులిని జాయిన్ చేస్తారు . అవి నిజమైన పులితో తలపడినట్టే చూపిస్తారన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: