ప్రేమలు పెళ్ళిళ్ళూ సినిమాల్లోనే ఉండవు. రియల్ లైఫ్ లో కూడా ఉంటాయి. అయితే వాటికి పుకార్లు, షికార్లూ జోడించి పెద్దది చేసి పారేస్తారు గాలి గాళ్ళు. ఇటువంటివే సినిమా వారికి తెగ ఇరిటేట్ తెప్పిస్తాయి. ముఖ్యంగా  హీరోయిన్ల విషయానికి వస్తే వారి మీద వచ్చే రూమర్స్ అన్నీ ఇన్నీ కావు. వాళ్ళతో డేటింగ్, వీరితో పెళ్ళి అంటూ ఒకటే రాత‌లతో పిచ్చెక్కిపోతున్నారుట చాలా మంది హీరోయిన్లు. అసలు మా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు అని సూటిగా ప్రశ్నిస్తున్న హీరోయిన్లు కూడా ఎందరో ఉన్నారు.


ఇదిలా ఉండగా ఈ తరహా రూమర్స్ కి చెక్ పెట్టేందుకు టాలీవుడ్లో వరస సినిమాలు చేసిన తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది. ఇపుడు బాలీవుడ్లో నటిస్తూ హిట్లు కొడుతున్న ఈ అమ్మడు నా గురించి రూమర్స్ ప్రచారం చేయవద్దు, ఉన్న విషయం నేనే చెబుతాను అంటూ మీడియా  ముందుకు వచ్చింది. తాను ఇపుడు ప్రేమలో ఉన్నానని కూడా ఒప్పుకుంది. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా తన ప్రేమికుడు క్రికెటరో  సినిమా రంగానికి చెందిన వాడో కాడని కూడా క్లారిటీ ఇచ్చింది.


ఇంకా చెప్పాలంటే అతను ఈ ప్రాంతానికే చెందిన వాడు కాడంటూ కొత్త ట్విస్ట్ కూడా ఇచ్చేసింది. అయితే తాను ప్రస్తుతం పెళ్ళి చేసుకోనని అంటూ ప్రేమలోనే ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది. తనకు ఎపుడు కావాలంటే అపుడు పెళ్ళి చేసుకుని పిల్లలను కూడా కంటానని, తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని కూడా తాప్సీ చెప్పింది. మరి తాప్సీ అన్ని విషయాలు చెప్పాక కూడా ఇంకా ఆమె మీద రూమర్స్ ప్రచారం చేస్తే ఆ తప్పు చేసిన వాళ్లదే అవుతుంది. తాను ఏం చేసినా నిజాయతీగా మీడియాకు చెప్పే చేస్తానని అంటున్న తాప్సీని ప్రస్తుతం ఆమె ప్రేమలో అలాగే వదిలేస్తే మంచిదేమో కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: