మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ లో మొదటిసారిగా నెగటివ్ రోల్ లో నటిస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. సినిమాలో తమిళ హీరో అధర్వ కూడా నటించాడు. ఈ నెల 20న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న వాల్మీకి సినిమా నుండి మరో సాంగ్ వాకా వాకా అంటూ రిలీజ్ చేశారు.


మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించడం జరిగింది. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఆ పాత్రను పరిచయం చేస్తూ తనకు తానుగా పాడుకునే పాట ఈ వాకా వాకా సాంగ్. మిక్కి మేయర్ ఈ సినిమాకు సూపర్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.


ఇక వరుణ్ తేజ్ కు జోడీగా పూజా హెగ్దె నటించింది. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా వరుణ్ తేజ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా అదరగొట్టాడు వాల్మీకి. సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర చాలా గొప్పగా చేశాడని ప్రచార చిత్రాలు చూస్తేనే తెలుస్తుంది. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా వాల్మీకిలో వరుణ్ తేజ్ మాత్రం హిట్ అనే చెప్పొచ్చు అంటున్నారు.


ఒకవేళ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా కాకున్నా వరుణ్ తేజ్ పాత్ర ప్రకారం చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే వాల్మీకి పక్కా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హరీష్ శంకర్ మెగా హీరోలతో చేసిన ఏ సినిమా అయినా హిట్టు కొట్టింది. ఆ లెక్కన చూస్తే వాల్మీకి సూపర్ హిట్ అన్నట్టే లెక్క. సినిమా ఫలితంపై చిత్రయూనిట్ అంతా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: