'గ్యాంగ్ లీడర్' సినిమా ఒకప్పుడు చిరంజీవికి ఎంత పేరు తీసుకొచ్చిందో దాదాపు అదే స్థాయిలో నాని గ్యాంగ్ లీడర్ కూడా పేరు వచ్చేసింది. నాని కథానాయకుడిగా ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయకగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ అని పేరు వినగానే మొదట చిరంజీవి సినిమాకి దగ్గరగా తీస్తున్నారు ఏమో అని అందరూ భావించారు. 


అయితే నాని గ్యాంగ్ లీడర్ ఆ సినిమాకు ఈ సినిమాకు అసలు పోలిక లేదని ట్రైలర్ విడుదలైనప్పుడే అర్థం అయిపోయింది. ఈ సినిమాలో నాని రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారధిగా నటించి సీనియర్ నటి లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియాంక అరుల్ మోహన్ లకు గ్యాంగ్య్ లీడర్ గా నటించారు. ఇంకా విషయానికి వస్తే సినిమా చుసిన ప్రేక్షకులు అంత సినిమా అద్భుతం అని, కామెడీ డిటెక్టివ్ చిత్రం అని అంటున్నారు. 


ప్రేక్షకులు చెప్పిన ప్రకారం 'నాని గ్యాంగ్ లీడర్ చిత్రం చాలా బాగుందని, డీసెంట్ గా ఉందని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి చిన్న కన్‌ఫ్యూజన్ లేకుండా సినిమా చిత్రీకరించారని, దర్శకుడు విక్రమ్ తీసిన అన్ని చిత్రాలలో ఈ సినిమా అద్భుతమైనదని ప్రేక్షకులు పేర్కొన్నారు. మరోవైపు ఈ సినిమా సూపర్ ఉందని వెన్నెల కిషోర్ తో సాగిన కామెడీ ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది అని అంటున్నారు. 


అయితే ఒక కుటుంబం అంత కలిసి ఓ రివెంజ్ గ్యాంగ్ లీడర్ ని ఎన్నుకొని విలన్ పై రేవంగే తీర్చుకోవాలనుకుంటరు. అలానే నాని ని గ్యాంగ్ లీడర్ గా ఎన్నుకొని అతనితో పాటు వేరు రివెంజ్ తీర్చుకోడానికి చివరి వరుకు ప్రయత్నించి చివరిలో కామెడీగానే రివెంజ్ తీర్చుకుంటారు. సినిమా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంత చాలా చిక్కగా చిత్రీకరించారు దర్శకుడు విక్రమ్. 


ఈ సినిమాకి విలన్ పాత్ర కూడా బలాన్ని చేకూర్చింది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమైనా కార్తికేయ ఈ సినిమాతో 'విలన్'గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ఏది ఏమైనా ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: