ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాని ... తన నాచురల్  నటనతో అందరి మనసుల్లో  నాచురల్ స్టార్ గా ఒదిగిపోయాడు .నాని సినిమా వస్తుందంటే ...అన్ని సినిమాలల కాకుండా అందులో ఎదో మ్యాజిక్ ఉంటదని ప్రేక్షకులు  నమ్ముతారు.అందుకే నాని సినిమాలన్నీ హిట్ టాక్ తో దూసుకుపోతాయి.అలాగే నాని కూడా మంచి మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంటాడు .అయితే నేడు నాని నటించిన గ్యాంగ్ లీడర్ ప్రేక్షాకుల ముందుకు రాగా...ఈ సినిమాలో  కథ ,కథనం బాగున్నాయని...నాని పెర్ఫార్మెన్స్ చింపేసాడంటూ సినిమా చుసిన వాళ్లు చెప్తున్నారు .దీంతో నాని గ్యాంగ్ లీడర్  బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాదిస్తుందనిపిస్తుంది .


గ్యాంగ్ లీడర్ హిట్ టాక్ తో జోష్ మీదున్న నాని తన కొత్త మూవీ షూటింగ్ లో కూడా తొందరలో జాయిన్ అవ్వబోతున్నాడట . నాచురల్ స్టార్ నాని ,సుధీర్ బాబు కాంబినేషన్లో "వి " అనే సినిమా రాబోతుందంట .ఈ సినిమా కి ఇంద్రకంటి మహాన్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ...దిల్ రాజు ఈ సినిమాని  నిర్మిస్తున్నారట .
అయితే ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ అని ...ఇన్ని రోజులు సాఫ్ట్ గా కనిపించిన నాని ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నాడని సమాచారం  .ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వగా  థాయిలాండ్ లో సుదీర్ బాబు తో కొన్ని సన్నివేషాలను  చిత్రీకరిస్తున్నారట . కాగా ఇంకొన్ని రోజుల్లో నాని కూడా షూటింగ్ లో పాల్గొంటాడని చిత్ర బృందం తెలిపింది . కాగా నివేదా థామస్ ,అదితీరావు హైదరి లు ఈ సినిమాలో   కథానాయికలుగా కనిపించనున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: